Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఒకే ఒక్క చాన్స్' అంటూ వ్యభిచార రొంపిలోకి కలల హీరోయిన్స్...

ఒకే ఒక్క చాన్స్ ఇస్తే చాలు తమ సత్తా చాటుతామంటూ హైదరాబాద్‌కు వచ్చే అనేక మంది యువతులు వ్యభిచార రొంపిలోకి చిక్కుకుంటున్నారు. సినీ కళామతల్లిపై ఉన్న మక్కువతో కళామతల్లి ఏదో ఒకరోజున అక్కున చేర్చుకుంటుందనే నమ

Advertiesment
'ఒకే ఒక్క చాన్స్' అంటూ వ్యభిచార రొంపిలోకి కలల హీరోయిన్స్...
, సోమవారం, 23 జనవరి 2017 (10:31 IST)
ఒకే ఒక్క చాన్స్ ఇస్తే చాలు తమ సత్తా చాటుతామంటూ హైదరాబాద్‌కు వచ్చే అనేక మంది యువతులు వ్యభిచార రొంపిలోకి చిక్కుకుంటున్నారు. సినీ కళామతల్లిపై ఉన్న మక్కువతో కళామతల్లి ఏదో ఒకరోజున అక్కున చేర్చుకుంటుందనే నమ్మకంతో ఎదురుచూసే చాలా మందికి చేదు అనుభవమే ఎదురవుతుంది. సినిమాల్లో హిరోయిన్‌గా రాణించాలని ఇంట్లో చెప్పకుండా నిత్యం ఎంతో మంది యువతులు నగరానికి వస్తుంటారు. వారు రైల్వేస్టేషన్‌లో దిగగానే కొందరు పసిగట్టి మోసం చేస్తుంటారు. మరికొందరు అమ్మాయిల స్టూడియోల వరకు వచ్చినా ఏజెంట్లు, బ్రోకర్ల మాటలు నమ్మి తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. వారు విషయం గ్రహించేలోపే మోసపోతున్నారు. జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది.
 
ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకొని వారిలా తాము కూడా సినిమాల్లో రాణించవచ్చని కలలుగంటారు. ఇంట్లో పెద్దలు అభ్యంతరం చెప్పినా వినరు. వారికి చెప్పకుండా ఇంట్లోంచి పారపోయి వస్తున్నారు. తమకు నటన, నృత్యం కూడా వచ్చుననే ధీమాతో ‘ఒకే ఒక్క చాన్స్‌’ ఇస్తే చాలు తమ సత్తా చూపుతామని పలువురు యువతులు సినిమా వేషాల కోసం వచ్చి మోసపోతున్నారు.
 
ఇటీవలి కాలంలో వ్యభిచార కేసుల్లో పట్టుబడుతున్న వారిలో ఎక్కువమంది సినీ అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చినవారే కావడం గమనార్హం. వీరంతా సినీ ఏజెంట్ చేతిలో మోసపోయి పోలీసులకు పట్టుబడుతున్నారు. నటనపై మక్కువతో కొందరు అమ్మాయిలు ఇష్టం లేకున్నా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారు కొన్నాళ్లకి హీరోయిన్‌గా అవకాశం రాక, తిండికి లేక తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నారు. ఊరెళ్తే కన్నవారు ఆదరిస్తారో లేదో తెలియక చావైనా.. బతుకైనా ఇక్కడే అని బావించి వారు జీవచ్చవంలా బతుకీడుస్తుండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమితాబ్ వద్దంటే సినిమా ఆపేయాలా? కృష్ణవంశీ ప్రశ్న.. రైతు పాత్రలో కృష్ణంరాజు!