అమితాబ్ వద్దంటే సినిమా ఆపేయాలా? కృష్ణవంశీ ప్రశ్న.. రైతు పాత్రలో కృష్ణంరాజు!
బాలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అమితాబ్ నటించేందుకు అంగీకరించక పోతే ఆ సినిమా తీయడాన్ని ఆపివేయాలా అంటూ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణవంశీ పేరు కూడా వచ్చ
బాలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అమితాబ్ నటించేందుకు అంగీకరించక పోతే ఆ సినిమా తీయడాన్ని ఆపివేయాలా అంటూ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వందో చిత్రం రేసులో కృష్ణవంశీ పేరు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. 'రైతు' కథతో ఓ స్క్రిప్టు తయారు చేసి బాలకృష్ణకు కృష్ణవంశీ వినిపించగా, అది ఇద్దరికీ నచ్చింది. అయితే ఈలోగా క్రిష్ మళ్లీ రేసులోకి వచ్చాడు. బాలయ్యకు ఓ కథ వినిపించాడు. దీంతో కృష్ణవంశీ చిత్రం వెనక్కి వెళ్లిపోయింది.
అయితే ఇప్పుడు రైతు కథ రెడీ సిద్ధమైంది. కాగా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం అమితాబ్‌ను అనుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య బాలకృష్ణ చెప్పారు. . ఈ పాత్రను ఆయన చేసే అవకాశాలు ఉన్నాయనీ .. ఒకవేళ ఆయన కుదరదంటే ఈ సినిమా ఉండకపోవచ్చని కూడా వార్తలు వచ్చాయి.
లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. అమితాబ్ చేయకపోతే.. ఆ స్థానంలో కృష్ణంరాజును తీసుకునే ఆలోచనలో కృష్ణవంశీ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అమితాబ్ తర్వాత ఆ పాత్రకి కృష్ణంరాజు మాత్రమే సరిగ్గా సరిపోతాడని కృష్ణవంశీ భావిస్తున్నాడట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.