ధ్రువ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు.. నవంబర్ 25 సాయంత్రం 7 గంటలకు రిలీజ్
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో రూపొందుతున్న సినిమా ధ్రువ. ఇందులో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమా తమిళ ''తని ఒరువన్'' రీమేక్‌గా ఈ చిత్రం
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో రూపొందుతున్న సినిమా ధ్రువ. ఇందులో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమా తమిళ ''తని ఒరువన్'' రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్టులుక్‌కి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో టీజర్‌పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.
ఈ నేపథ్యంలో 'ధ్రువ' సినిమాను వచ్చేనెల 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈలోగా ఒక ట్రైలర్ వదలాలనే నిర్ణయానికి ఈ సినిమా టీమ్ వచ్చింది. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కి.. ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా హిట్ పై దర్శక నిర్మాతలు గట్టి నమ్మకంతో వున్నారు. చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించే ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్నాడు.