బాహుబలి2లో అనుష్క గ్లామర్ పంట.. ప్రభాస్‌తో అనుష్క రొమాంటిక్ సాంగ్?
బాహుబలి 2లో అనుష్క అందాల ఆరబోతకు ఏమాత్రం కొదవుండదని సినీ జనం అంటున్నారు. ప్రభాస్‌తో లవ్ సీన్స్ అదిరిపోతాయని వారు చెప్తున్నారు. అంతేగాకుండా అనుష్క బాహుబలి2లో మరింత గ్లామర్‌గా కనిపిస్తుందట. ఆమెపై ఒక రొమ
బాహుబలి 2లో అనుష్క అందాల ఆరబోతకు ఏమాత్రం కొదవుండదని సినీ జనం అంటున్నారు. ప్రభాస్‌తో లవ్ సీన్స్ అదిరిపోతాయని వారు చెప్తున్నారు. అంతేగాకుండా అనుష్క బాహుబలి2లో మరింత గ్లామర్‌గా కనిపిస్తుందట. ఆమెపై ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని అంటున్నారు. అభిమానులకు పూర్తిస్థాయి సంతృప్తిని కలిగించే విధంగా ఈ సినిమా అనుష్క కనిపిస్తుందని సినీ పండితులు అంటున్నారు.
కాగా, 'బాహుబలి' మొదటిభాగంలో అనుష్క గ్లామర్‌గా కనిపించలేదు. ఆ తర్వాత అనుష్క చేసిన 'రుద్రమదేవి' కూడా చారిత్రక చిత్రం కావడం వలన ఆమె గ్లామర్‌గా కనిపించలేదు. ఇక 'సైజ్ జీరో'లో బాగా బరువు పెరిగి కనిపించడం వలన, ఆమె గ్లామర్ చూడాలనుకున్న అభిమానుల కోరిక పూర్తిస్థాయిలో తీరలేదు. దీంతో నిరాశకు గురైన ఫ్యాన్స్‌కు బాహుబలి2 ద్వారా అనుష్క సూపర్ ట్రీట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.