Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ నాలుగో సీజన్.. మోనాల్‌ను ముద్దు అడిగిన అఖిల్

Advertiesment
Sunday Funday
, ఆదివారం, 1 నవంబరు 2020 (12:24 IST)
బిగ్ బాస్ తెలుగు నాల్గవ సీజన్ ఎనిమిదవ వారం పూర్తి చేసుకోబోతోంది. ఆదివారం ఇంటి నుండి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారు. అనారోగ్యం కారణంగా నోయల్ హౌజ్ నుండి స్వయంగా తనకు తానే బయటకు వెళ్లగా.. ఆదివారం నామినేషన్‌లో ఉన్న ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

మొదటి వారం సూర్య కిరణ్ ఎలిమినేట్ అవ్వగా.. రెండవ వారం కరాటే కళ్యాణీ ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత మూడవ వారం దేవి నాగవల్లీ, నాల్గవ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతీ దీక్షిత్, ఐదవ వారం జోర్దార్ సుజాత ఎలిమినేట్ అవ్వగా.. గంగవ్వ ఆరోగ్యం సరిగా లేక స్వయంగా ఇంటి నుండి బయటకు వచ్చింది. 
 
ఇక ఆరవ వారంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వగా.. ఏడవ వారం దివి వాడ్త్యా ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇక ఎనిమిదవ వారంలో.. హౌస్ లో 11మంది కంటెస్టెంట్లు మిగిలగా.. నోయల్ ఆనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈ వారం నామినేషన్‌లో ఆరుగురు ఉన్నారు. నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్‌లు పేర్లు చూస్తే.. అఖిల్, మోనాల్, అరియానా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, లాస్య ఉన్నారు. 
 
నామినేట్ అయిన వారిలో అరియానా, అఖిల్, లాస్య బలంగా ఉన్నారు. వీరిలో అఖిల్, లాస్య ఈ వారానికి సేవ్ అవ్వగా.. ఇక నామినేషన్‌లో నలుగురు ఉన్నారు. వారు అమ్మ రాజశేఖర్, మోనాల్, మెహబూబ్, అరియానా.. ఈ నలుగురిలో అరియనా, మెహబూబ్, మోనాల్ సేవ్ అవ్వుతారని.. అమ్మా రాజశేఖర్ ఈ వారం ఎలిమినేట్ అవ్వడం పక్కా అంటున్నారు నెటిజన్స్.
 
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ప్రేమ పావురాలు.. అఖిల్ అండ్ మోనాల్ అని తెలిసిందే. ఈ ఇద్దర్ని సోషల్ మీడియా లవర్స్‌గా వర్ణిస్తుంది. దానికి తగ్గట్లుగానే బిగ్ బాస్ వారిని చూపిస్తున్నాడు. ఇక తాజాగా స్టార్ మా విడుదల చేసిన బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతున్నాడు. అఖిల్ మాత్రం అందరి ముందే మోనాల్‌ను ఓ ముద్దు అడిగాడు. 
 
అంతేకాదు రివర్స్‌గా మోనాల్ కిస్ ఇస్తుంటే నేనే వద్దన్న అంటూ అరియానాతో చెప్తుతున్నాడు. దీంతో ఇంటి సభ్యులు.. చిరునవ్వి ఊరుకున్నారు. మోనాల్ మాత్రం కొద్దిగా సిగ్గుపడుతూ పక్కకు వెళ్లిపోయింది. మరీ అఖిల్ ఏ సందర్భంలో మోనాల్‌ను ఆ కిస్ అడిగాడో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజాను కలిసిన బండ్లగణేష్.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనలేదే..!