Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

Advertiesment
Dulkan - aakasamlo oka tara

దేవీ

, సోమవారం, 28 జులై 2025 (18:50 IST)
Dulkan - aakasamlo oka tara
దుల్కర్ సల్మాన్.. విలక్షణ చిత్రాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ ఉదాహరణలు. ఈ వెర్సటైల్ యాక్టర్ ఇప్పుడు వినూత్నకథా శైలితో యూనిక్ సినిమాలను తెరకెక్కించే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో చేతులు కలిపారు. ఆ సినిమాయే ‘ఆకాశంలో ఒక తార’. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో  ప్రేక్షకులను అలరించేలా రూపుదిద్దుకుంటోంది.
 
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్ఫణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ మేకర్స్ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంటూ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.
 
ఈ గ్లింప్స్‌‌ను గమనిస్తే మన సాధారణ జీవితంలో కనిపించే క్షణాలను అందంగా చూపించారు. దుల్కర్ సల్మాన్ ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా కనిపిస్తూ ప్రతి ఫ్రేమ్‌కి ప్రత్యేకతను తీసుకొచ్చారు. చివర్లో ఓ స్కూల్ గర్ల్ పరుగెత్తే సీన్ ఎంత సాదాసీదాగా ఉన్నా అది ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ గ్లింప్స్‌కి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.ఈ గ్లింప్స్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
 
గ్లింప్స్‌‌లో దుల్కర్ సల్మాన్ ప్రెజన్స్ మరింత ఎఫెక్టివ్‌గా ఉంది. డిఫరెంట్ కథలతో సినిమాలను ఎంచుకోవటంలో దుల్కర్ తన ప్రత్యేకతను మరోసారి చూపించారనే విషయం గ్లింప్స్‌తో స్పష్టమైంది. ఆయన నటనకు పవన్ సాధినేని క్రియేటివ్ విజన్ తోడై ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ఓ మెమొరబుల్ మూవీగా మన ముందుకు రానుంది. సినిమాలోని గొప్ప భావోద్వేగాలుంటాయనే విషయం గ్లింప్స్ చూస్తుంటే స్పష్టమవుతుంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ మరింత ప్లస్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్