Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘‘గౌతమీ పుత్ర శాతకర్ణి’’ ట్రైలర్ రిలీజ్... బాలయ్య 100వ చిత్రం స్టామినా అదుర్స్

చిత్ర ప్రారంభం నుండే సంచలనాలకు కేంద్ర బిందువవుతున్న బాలయ్య శత చిత్రం ‘‘గౌతమీపుత్ర శాతకర్ణి’’ అభిమానుల సమక్షంలో కరీంనగర్ తిరుమల థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ 100 థియేటర్లలో రిలీజ్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుద

Advertiesment
Gauthami Puthra Satakarni Trailer Review
, శుక్రవారం, 16 డిశెంబరు 2016 (20:58 IST)
చిత్ర ప్రారంభం నుండే సంచలనాలకు కేంద్ర బిందువవుతున్న బాలయ్య శత చిత్రం ‘‘గౌతమీపుత్ర శాతకర్ణి’’ అభిమానుల సమక్షంలో కరీంనగర్ తిరుమల థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ 100 థియేటర్లలో రిలీజ్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల కూడా చరిత్రకెక్కింది. కరీంనగర్ వేదికగా మారడంతో పాటు అభిమానులుతో కోలాహాలంగా మారింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డిగారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలవడం విశేషం.
 
ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ... వందో చిత్రాన్ని బాలయ్య బాబు ఎందుకు పెట్టాడో ఈ ట్రైలర్ కొంచెం చూపించింది. కోటి రతనాల వీణ తెలంగాణ, ఇక్కడ కోటి లింగాల సాక్షిగా శతచిత్ర యోధుడు నందమూరి అందగాడు బలయ్య బాబు నూరోచిత్రం ‘‘గౌతమీ పుత్ర శాతకర్ణి’’  ట్రైలర్ రిలీజ్ చేయడానికి మొదట కొని మమ్మల్ని ఆశీర్వదించిన సుధాకర రెడ్డి గారు రిలీజ్ చేస్తారు.
 
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కరీనంగర్ లో చేయడం... కోటిలింగాలకు వెళ్ళడం.. ఇక్కడ దర్శనం చేసుకొని గౌతమి పుట్టిన ఊరు కోటి లింగాలు. ఇక్కడ నుండి శాతవాహనకు సింహద్వారం అయిన కోటిలింగాల నుండి అమరావతి కేంద్రంగా అంఖడ భారతావనిని పాలించిన మహానుభావుడు, శకపురుషుడు శాతకర్ణి అవడం మన తెలుగువారికి ఎంతో గర్వ కారణం.. ఈ ప్రపంచపటంలో ఈ దేశానికి గౌరవం ఇచ్చిన కానరాని భాస్కరుని వీరగాధ ఈ శాతకర్ణి. మరి ఒక తెలుగుబిడ్డగా ప్రపంచ వ్యాప్తంగా.. తెలుగు జెండా ఎగుర వేసిన నందమూరి తారకరారమారావు గారి  వారసునిగా కథను చాటి చెప్పడం నా ధర్మంగా భావించాను. 
 
99 సినిమాలు చేసాను.. వందో సినిమాలు ఏం చేయాలా అని కథలు వింటున్నాను. నేను అనుకునే స్థాయికి నానుండి నా అభిమానులు కోరుకునే స్థాయికి రాలేదు అని సతమతం అవుతున్న సమయంలో క్రిష్ గారు రావడం.. అంతకుముందు పరిచయం లేదు.. దేవుడే కలిపాడు. డాక్టర్ అవుదామని యాక్టర్ అవుదామని అందరూ అంటుంటారు. కానీ యాక్టర్‌నే అవుదామనకున్నాను. కానీ డాక్టర్‌గా సింహాలో చేసిన తర్వాత ఇండో అమెరికన్ హాస్పటల్‌కి ఛైర్మన్ అయ్యాను. సింహా తర్వాత శాసనసభ్యుడ్ని అయ్యాను. జంబూ ద్వీప కాలమానం ప్రకారం ఉగాది జరుపుకుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో, విదేశాల్లో కూడా మారిషస్‌లో కూడా నాకు తెలిసింది.. నాకు తెలిసింది మూడో మూడు శకాలు.. శాలివాహన, స్వాతంత్ర భారతదేశం పోరాటం.. మూడోది ఎన్టీఆర్ శకం.. ఎన్టీఆర్ ఎన్నో పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. పోలీస్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం.. లాంటివి చేసారు. 
 
నేను ఇదే మొదటిసారి ట్రైలర్ చూడడం ప్రేక్షకుల మధ్యనే చూడాలనే ఆగాను. ఎన్టీఆర్ అంటే అందరి గుండెల్లో నిండుగా, మెండుగా ఉంటాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు.. ఎవరైతే తన పుట్టిన గడ్డకు, ప్రాంతానికి, దేశానికి పేరుప్రఖ్యాతులు తెస్తారో వారి జన్మే ధన్యం అవుతుంది. వారి యుగపురుషులు అవుతారు. వారికి చావుపుట్టకలతో పరిచయం ఉండదు. అలాంటి వారిలో ఒక శాతకర్ణి, ఒక అంబేద్కర్, ఒక గాంధీజీ, ఒక ఎన్టీఆర్ గారు.. ఎన్నో సినిమాలు చేసాను. ఇలాంటి పాత్ర లభించండం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. నరసింహస్వామిని దర్శించికోవడం నాకు ఆనవాయితీ. ఈ చిత్రం కోసం కాలం ఎదురుచూసిందో మా షూటింగ్ జరిగినన్నాళ్లూ ఎలాంటి ఆటంకాలు జరగలేదు. ప్రకృతి కూడా సహకరించింది. మా అందరి అదృష్టం.. మా నిర్మాతలు కూడా మంచి చిత్రం అందించాలని కోరుకున్నారు.
 
క్రిష్ గారు యావత్ భారతదేశం గర్వించతగ్గ దర్శకుడు. సినిమా సినిమాకి ఎటువంటి పోలిక లేకుండా, ఏదో కొత్తదనం అందించాలని ఉవ్విళ్ళూరుతుంటారు. ఆయన తెలుగు దర్శకుడు కావడం మన అదృష్టం. సాయిమాధవ్ గారి సంభాషణలను రావడం చాలా కష్టం. పరబ్రహ్మశాస్త్రి గారు ఈ శాతవాహునులు తెలుగువారిని నిరూపించింది ఆయన. ఆయనకు ఈ సభాముఖంగా నివాళులు అర్పిస్తున్నాను. చాలామంది సినిమా అయిపోయిందంటే నమ్మాలా.. మాములుగా అయితే రెండుమూడు సంవత్సరాలు పడుతుంది.

ఇది ఎక్కువ కథను పరిశోధించడం కష్టం. మేం ఎప్పుడూ చిన్నప్రయత్నాలు చేయం. పెద్ద ప్రయత్నాలే చేస్తాం.. ఆ ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాం.. మా నాన్నగారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాం. అందుకే ఆదిత్య 369, భైరవద్వీపం, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలు చేసాను. నా నిర్మాతలే నాకు శ్రీరామరక్ష. కెమెరామెన్ బాబా గారు ఈ సినిమాకు అద్భుతంగా పనిచేసారు. అన్ని హంగులతో ఈ సినిమా మీముందుకు రాబోతుంది. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనారోగ్యంతో ఉన్నప్పుడు స్టోరి చెప్పి నవ్వించాడు... డి.సురేష్‌ బాబు