Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనారోగ్యంతో ఉన్నప్పుడు స్టోరి చెప్పి నవ్వించాడు... డి.సురేష్‌ బాబు

విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ డి. సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'పిట్టగోడ'. అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌ కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మించారు. కాగా, ఇందులోని నాలగవ పాటను రామానాయుడు స్టూడియోలో డి. సురేష

అనారోగ్యంతో ఉన్నప్పుడు స్టోరి చెప్పి నవ్వించాడు... డి.సురేష్‌ బాబు
, శుక్రవారం, 16 డిశెంబరు 2016 (20:39 IST)
విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ డి. సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'పిట్టగోడ'.  అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌ కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మించారు. కాగా, ఇందులోని నాలగవ పాటను రామానాయుడు స్టూడియోలో డి. సురేష్‌ బాబు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసారు రామ్మోహన్‌. అది ఇష్టమో, ప్రేమో తెలీదు. అలా చేయడంవల్ల ఎంతోమంది టాలెంట్‌ వున్న వాళ్ళు బయటికి వస్తారు. 
 
మళ్లీ 'పిట్టగోడ' చిత్రంతో చాలామందిని పరిచయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బాగా నటించారు. సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఓవర్సీస్‌లో షో వేస్తే ఒక డిస్ట్రిబ్యూటర్‌ సినిమా కొన్నాడు. అతని దగ్గర్నుండి ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి మరొక డిస్ట్రిబ్యూటర్‌ కొన్నారు. డెఫినెట్‌గా ఈ సినిమా సక్సెస్‌ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. కమలాకర్‌ చాలామంచి మ్యూజిక్‌ అందించాడు. ముఖ్యంగా రీ-రికార్డింగ్‌ చక్కగా చేసాడు. 'ఉయ్యాలా జంపాలా' సినిమా గత డిసెంబర్‌ 25న రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాని ఈ డిసెంబర్‌ 24న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. మా బేనర్‌ పెట్టి 52 సంవత్సరాలైంది. ఎంతోమంది కొత్తవాళ్లు ఎన్నో కలలు కంటారు. వారి కలలను ఫుల్‌ ఫిల్‌ చేశాం. వారంతా సెల్యులాయిడ్‌ పై సక్సెస్‌ అయ్యారు. 'పిట్టగోడ' చిత్రం ద్వారా కొత్త టాలెంట్‌ని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. 
 
మంచి సినిమా. సోషల్‌, డిజిటల్‌ మీడియాలో ఈ సినిమా మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అలాగే ప్రేక్షకుల సపోర్ట్‌, ఎంకరేజ్‌మెంట్‌ ఇలాగే వుండాలి. మా నాన్నగారు అనారోగ్యంతో వున్నప్పుడు నేను బెంగుళూరులో వున్నాను. ఆ టైమ్‌లో రామ్మోహన్‌ అనుదీప్‌ని తీసుకుని వచ్చాడు. శాడ్‌ మూడ్‌లో వున్నప్పుడు అనుదీప్‌ 'పిట్టగోడ' స్టోరి చెప్పి నవ్వించాడు. గోదావరిఖని వంటి రియల్‌ లొకేషన్స్‌లో ఈ సినిమా చేవారు. మంచి సినిమా చేశాం. సక్సెస్‌ అవుతుందని చాలా నమ్మకంగా వున్నాం'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్'... అంతమందా? రివ్యూ రిపోర్ట్