Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హృదయవిదారకంగా ఉంది.. ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తుంది : గౌతం మీనన్

Advertiesment
Gautham Menon

వరుణ్

, బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (14:00 IST)
హీరో విక్రమ్ కథానాయకుడి గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధృవనక్షత్రం. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంది. పలుమార్లు వాయిదా వాయిదా పడింది. తాజాగా దీనిపై దర్శకుడు స్పందించారు. ఈ సినిమా వాయిదా పడటం తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని చెప్పారు. 
 
'ఇది చాలా హృదయవిదారకంగా ఉంది. చిత్రం వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదు. నా కుటుంబం ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈ విషయమే ఆలోచిస్తోంది. నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోంది. కానీ, పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని ఉంటున్నా. మార్చి1న  'జాషువా' విడుదల కానుంది. ముందే 'ధృవనక్షత్రం' విడుదల చేయాలని భావించాం. అది కుదరలేదు' అని అసహనం వ్యక్తంచేశారు. 
 
2016లోనే 'ధృవనక్షత్రం' పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఆర్థిక ఇబ్బందులతో సినిమా విడుదల నిలిచిపోయింది. గతేడాది నవంబర్‌లో విడుదలచేయాలని భావించగా తిరిగి వాయిదా పడింది. శింబు హీరోగా గౌతమ్‌ మేనన్‌ 'సూపర్‌ స్టార్‌' చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకొని, ఆ మేరకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని, కానీ సినిమాని పూర్తి చేయలేదని.. డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నగదు తిరిగి చెల్లించేవరకూ 'ధృవనక్షత్రం' విడుదలను ఆపివేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంతకు కసి తీర్చుకునే సమయం వచ్చేసిందట, ఎవరిపైనో తెలుసా?