Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

Advertiesment
Anandi as Garividi Lakshmi

దేవీ

, సోమవారం, 21 జులై 2025 (09:21 IST)
Anandi as Garividi Lakshmi
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది పీపుల్స్ మీడియా. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనందీ మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా చూపించబోతోంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది.
 
తాజాగా విడుదలైన గ్లింప్స్ వింటేజ్ వైబ్ తో అదిరిపోయింది. ఊరి స్టేజీలు, జనం కేరింతలు, ఫోక్ ఐకాన్ గా నిలిచిన గరివిడి లక్ష్మి ఎంట్రీతో గ్లింప్స్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది.
 
లక్ష్మిగా ఆనందీ పెర్ఫార్మెన్స్  అద్భుతంగా వుంది. 15 ఏళ్లలో 10,000 స్టేజీలను తాకిన గాయనీ జీవితాన్ని రిక్రియేట్ చేసింది. ఆమె పాటలు వింటూ ఎదిగిన 90స్ తరం మళ్లీ అలానే ఫీల్ అవుతుంది. ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయిన రోజులను గుర్తు చేస్తుంది.
 
చరణ్ అర్జున్ అందించిన నేపథ్య సంగీతం ఆ విజువల్స్‌ని మరింత ఎలివేట్ చేసింది. పాటలు, సంగీతం, ఆర్ట్– ఇవన్నీ కలసి ఈ గ్లింప్స్‌ని అద్భుతంగా మార్చాయి.
 
‘గరివిడి లక్ష్మి’ మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా.
 
ఈ సినిమా సినిమాటోగ్రఫీని జె. ఆదిత్య. ప్రస్తుతం సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది.
 
తారాగణం:  నరేష్, రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?