Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Advertiesment
Yukthi reja, Kiran Abbavaram, naresh

చిత్రాసేన్

, శుక్రవారం, 17 అక్టోబరు 2025 (14:51 IST)
Yukthi reja, Kiran Abbavaram, naresh
కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా K-ర్యాంప్. ఈ సినిమాను రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మించారు. సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - మేమంతా ఒక మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది. మంచి సినిమా చేసినప్పుడే మిమ్మల్ని థియేటర్స్ రమ్మని కాన్ఫిడెంట్ గా పిలుస్తాం. ఈ సినిమా అనుకున్నప్పుడే దీపావళి రిలీజ్ అని ఫిక్స్ అయ్యాం. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి నవ్వుకునే సినిమా అవుతుందని నమ్మాం. మేము అనుకున్నదానికంటే మూవీ ఇంకా బాగా వచ్చింది. కె ర్యాంప్ మీ ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చుని నవ్వుకునే మూవీ. నన్ను మా టీమ్ అందరినీ నమ్మండి. సినిమా బాగా వచ్చింది. 
 
ఈ దీపావళి పండుగ కె ర్యాంప్ మూవీతో మరింత సరదాగా ఉంటుంది. నా ఫ్యాన్స్ అన్నా పిలిస్తే కరిగిపోతాను. అన్న మంచి సినిమా చేశాడని మీరు చెప్పుకునేలా ప్రతి సినిమాకు బెటర్ మెంట్ చేసుకుంటూ వస్తున్నా. మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను. ఈ నెల 18న థియేటర్స్ లో కె ర్యాంప్ ర్యాంపేజ్ చూస్తారు. నా మంచి కోరే వారు ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుని బెటర్ మెంట్స్ చేసి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. థియేటర్స్ లోకి వెళ్లేముందు ఇది కంప్లీట్ ఎంటర్ టైనర్ అని గుర్తుపెట్టుకోండి. మీ టికెట్ డబ్బులు వృథా కావు. టికెట్ బుక్ చేయాలా వద్దా అనుకునేవారు కాన్ఫిడెంట్ గా బుక్ చేసుకోండి. మిమ్మల్ని గ్యారెంటీగా నవ్విస్తాం. ఈ సినిమాకు తప్పకుండా సక్సెస్ మీట్ ఉంటుంది. ఆ సక్సెస్ మీట్ లో నా టీమ్ అందరి గురించి మాట్లాడుతా. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ