Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిబియా నియంత గడాఫీతో ఫోజిచ్చిన కత్రినా కైఫ్... నెట్‌లో ఫోటో వైరల్

మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించి.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అందాలతో కట్టిపడేసిన కత్రినా కైఫ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకుంటోంది. తాజాగా కత్ర

Advertiesment
లిబియా నియంత గడాఫీతో ఫోజిచ్చిన కత్రినా కైఫ్... నెట్‌లో ఫోటో వైరల్
, సోమవారం, 10 జులై 2017 (19:01 IST)
మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించి.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అందాలతో కట్టిపడేసిన కత్రినా కైఫ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకుంటోంది. తాజాగా కత్రినాకు సంబంధించిన ఫోటో నెట్‌లో వైరల్ అవుతోంది. కరుడుగట్టిన నియంత గడాఫీ పక్కన కత్రినా మోకాళ్లపై కూర్చుని ఉన్న ఫొటో సోషల్‌మీడయాలో వైరల్‌గా మారింది. 
 
సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా పనిచేసిన కత్రినాకైఫ్, లిబియాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఆ సందర్భంగా లిబియా నియంత గడాఫీతో కలిసి పలువురు మోడల్స్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలో కత్రినాతో పాటు నేహాధుపియా, అదితి గోవిత్రికర్, అంచల్ కుమార్ తదితర మోడల్స్ ఉన్నారు. అలా గడాఫీతో ఫొటో దిగినవారిలో కత్రినా కైఫ్ కూడా ఉంది. ఆ ఫ్యాషన్‌ షో జరిగి 15 ఏళ్లు పూర్తయ్యాయి. తాజాగా షమితాసింఘా అనే మోడల్ ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్ ఫొటోను పోస్ట్ చేసింది. 
 
లిబియాలో జరిగిన ఫ్యాషన్ షోలో మనం పాల్గొని 15 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పుడు గడాఫీని కలిసే అవకాశం వచ్చిందని.. ఆ ట్రిప్ గుర్తుందా అంటూ సహచర మోడల్స్‌ను షమితా ప్రశ్నించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా ప్రకటించారనీ 'దువ్వాడ జగన్నాథమ్' ఆఫీసుపై దాడి