అలా ప్రకటించారనీ 'దువ్వాడ జగన్నాథమ్' ఆఫీసుపై దాడి
మెగా అభిమానులు మరోమారు రెచ్చిపోయారు. అల్లు అర్జున్ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని డీజే కార్యాలయంపై దాడికి దిగారు. దిల్ రాజు నిర్మాతగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "దువ్వాడ
మెగా అభిమానులు మరోమారు రెచ్చిపోయారు. అల్లు అర్జున్ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని డీజే కార్యాలయంపై దాడికి దిగారు. దిల్ రాజు నిర్మాతగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "దువ్వాడ జగన్నాథమ్". ఈ చిత్రం గత నెల 24వ తేదీన విడుదల కాగా, విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్‌కు సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచి వివాదాల్లో ఉన్న ఈ సినిమా తాజాగా మెగా అభిమానుల ఆగ్రహానికి గురై మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ కంటే ‘డీజే’ అత్యధిక కలెక్షన్లు సాధించిందని వచ్చిన వార్తలపై మెగా అభిమానులు మండిపడ్డారు. అంతటితో ఆగనివారు ‘డీజే’ ఆఫీసుపై దాడి చేశారు. డీజే కలెక్షన్లకు సంబంధించిన ఆధారాలు చూపించాలని హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో ఉన్న డీజే ఆఫీసు ముందు నినాదాలు చేశారు. మెగా అభిమానుల నుంచి ఊహించని ఈ సంఘటనతో నిర్మాత దిల్‌రాజ్ షాక్ అయ్యారట. ఆగ్రహంతో ఊగిపోతున్న మెగా అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో దిల్‌రాజు కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేశారట.