బుల్లితెరలో సంసారం దిద్దుబాటు కాదు... నిప్పులు పోస్తున్నారు... 'మెంటల్ కృష్ణ'
బుల్లితెరపై వస్తున్న సంసారం నిలబెట్టే కార్యక్రమాలు ఒక వ్యాపార కార్యక్రమంగా మారిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు పోసాని క్రిష్ణమురళి. ఆ కార్యక్రమాలకు వస్తున్న కుటుంబాలు ఎప్పటికైనా కలుస్తాయని, అయితే వారిని బుల్లితెరలో నిర్వహించే కార్యక్రమాలకు తీసుక
బుల్లితెరపై వస్తున్న సంసారం నిలబెట్టే కార్యక్రమాలు ఒక వ్యాపార కార్యక్రమంగా మారిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు పోసాని క్రిష్ణమురళి. ఆ కార్యక్రమాలకు వస్తున్న కుటుంబాలు ఎప్పటికైనా కలుస్తాయని, అయితే వారిని బుల్లితెరలో నిర్వహించే కార్యక్రమాలకు తీసుకొచ్చి వారు జీవితంలో మళ్ళీ కలవనీయకుండా చేసేస్తున్నారని మండిపడ్డారు పోసాని. ఒకవేళ తమ ఎపిసోడ్ సమయానికి కుటుంబాలు దొరక్కపోతే చిన్న ఆర్టిస్టులు తీసుకొచ్చి వారితోనే గందరగోళం చేయిస్తున్నారని, ఇదంతా కొన్ని టీవీ ఛానళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే ఇలా చేస్తున్నాయని ఆరోపించారు.
దాంతో ఆగలేదు పోసాని.. ఇలాంటి కార్యక్రమాలు ఎత్తెయ్యాలని, దీన్ని చూస్తున్న కొన్ని కుటుంబాల్లో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. పోసాని చేసిన వ్యాఖ్యలపై కొంతమంది బుల్లితెర నటులు మండిపడుతుంటే మరికొంతమంది మాత్రం ఏకీభవిస్తున్నారు. పోసాని చెప్పినవాటిల్లో ఎలాంటి తప్పులేదంటున్నారు.