తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ఇప్పుడు సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆహా..తన తదుపరి షో తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశయంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్రతిభను వెలికితీయడానికి, సరైన వేదిక కల్పించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది. ఈ కార్యక్రమాన్ని సింగింగ్ సెన్సేషన్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తున్నారు. తెలుగు ఇండియన్ ఐడిల్‌కు ఆన్ లైన్ ఆడిషన్స్‌ను రీసెంట్‌గా నిర్వహించారు. దక్షిణాదిన నిర్వహించిన ఇండియన్ ఐడిల్ కాంపిటీషన్. ఆహా..ఇన్‌స్టాగ్రామ్ వారి కో పవర్డ్‌గా జనవరి 7 నుంచి ఆడిషన్స్ జరిగాయి. దీనికి అపూర్వమైన స్పందన వచ్చింది.
వర్ధమాన గాయకులు, సంగీతకారులు సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారందరూ తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌కు ఆన్‌లైన్ రిజిష్టర్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. వీరందరూ తమ ప్రతిభను ఇంత పెద్ద వేదికపై చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఆన్‌లైన్ ఆడిషన్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5000 ఎంట్రీలు వచ్చాయి. ఇదే ఈ ప్రోగ్రామ్‌పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఉదాహరణ. ఈ ఆన్‌లైన్ ఆడిషన్స్ జనవరి 16న ముగియనున్నాయి.