Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చపోలీ ఆనకట్ట వద్ద అశ్లీల వీడియో షూట్... పూనమ్‌పై కేసు!

Advertiesment
చపోలీ ఆనకట్ట వద్ద అశ్లీల వీడియో షూట్... పూనమ్‌పై కేసు!
, బుధవారం, 4 నవంబరు 2020 (15:20 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే చిక్కుల్లోపడ్డారు. గోవాలని చపోలి ఆనకట్ట వద్ద ఆమె అశ్లీల వీడియో షూట్ చేసినట్టు చేసిన ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూనమ్ పాండే ఇటీవల గోవా పర్యటనకు వెళ్లారు. అక్కడ చపోనీ ఆనకట్ట వద్ద ఆమె ఓ అశ్లీల వీడియోను చిత్రీకరించింది. 
 
ఇలా చేయడం డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీయడమేనని ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆరోపణలు చేస్తూ, ఏకంపా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూనమ్‌తోపాటు ఆ వీడియోను చిత్రీకరించిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పూనమ్ పాండేపై గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
సుప్రీంకెళతానంటున్న దిశ తండ్రి... 
మరోవైపు, వివాదాస్పద అంశాలు, సంచలన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించడంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందు వరుసలో ఉంటారు. తాజాగా 'దిశ ఎన్ కౌంటర్' అనే చిత్రాన్ని ఆయన రూపొందించారు. హైదరాబాద్ నగర శివార్లలో హైవే పక్కన నలుగురు ముష్కరులు హత్యాచారం చేసిన ఘటన ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
అయితే, ఈ చిత్రంపై దిశ తండ్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అసభ్యకరంగా ఈ చిత్రాన్ని రూపొందించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ట్రైలర్‌ను కూడా నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
సినిమాను అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు వరకు కూడా వెళతామని ఆయన అన్నారు. ఒకవేళ సినిమాను విడుదల చేస్తే పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పారు. మరోవైపు సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా...ఈ అంశంపై రామ్ గోపాల్ వర్మ ఇంత వరకు స్పందించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ హౌస్‌లో అవినాష్, ఇలాగైతే కష్టమే