Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోటిమాటతో కలెక్షన్ల వరదను కురిపిస్తున్న ఫిదా.. తొలివారంలో రూ. 40 కోట్ల వసూళ్లు

కుటుంబం, ప్రేమ, పెళ్ళి, పిల్లలు, తల్లిదండ్రులు అక్కాచెల్లెళ్ల మధ్య మమతలతో కూడిన మానవీయ అంశాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన మనోహర దృశ్య కావ్యం ఫిదా ప్రేక్షకులను ఫిదా చేయడమే కాకుండా రోజురోజుకూ భారీ కలెక్షన్లను రాబడుతోంది. సినిమా చాలా బాగుంది అనే ఒకే ఒక

Advertiesment
fidaa movie
హైదరాబాద్ , సోమవారం, 31 జులై 2017 (05:13 IST)
కుటుంబం, ప్రేమ, పెళ్ళి, పిల్లలు, తల్లిదండ్రులు అక్కాచెల్లెళ్ల మధ్య మమతలతో కూడిన మానవీయ అంశాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన మనోహర దృశ్య కావ్యం ఫిదా ప్రేక్షకులను ఫిదా చేయడమే కాకుండా రోజురోజుకూ భారీ కలెక్షన్లను రాబడుతోంది. సినిమా చాలా బాగుంది అనే ఒకే ఒక్క నోటిమాటతో ఫిదా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. తెలంగాణ భాష యాసకు పట్టం కడుతూ రైతుకుటుంబాల్లోని నిర్మల మానవ సంబంధాలను శిఖరస్థాయిలో చూపించిన ఫిదా సినిమా భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 
 
శేఖర్ కమ్ముల తాజా సినిమా 'ఫిదా' బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. మౌత్‌ పబ్లిసిటీతో భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో దాదాపు రూ. 40 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఫిదా జోరు కనిపిస్తుంది. 
 
ముఖ్యంగా అమెరికాలోనూ ఫిదా కలెక్షన్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా అమెరికాలో రూ.8.82 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. మున్ముందు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
 
రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులతో పాటు చాలా మంది ప్రముఖులు  సోషల్ మీడియాలో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సాయిపల్లవి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ్ తొలి కమర్షియల్‌ హిట్‌ అందుకున్నాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'By gods grace...my dear son is safe' : హీరో మోహన్ బాబు