Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జుట్టు రాలుతోందా? మెంతికూర ప్యాక్‌ను ట్రై చేయండి..

'కపిల్ శర్మ షో' పేరిట కపిల్ ఒక షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హాస్యభరితంగా సాగే ఈ షోలో గత వారం బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను వివాహం చేసుకుని, కపిల్ శర్మ తన కల నెరవేర్చుకున్నాడు. రాఖీ పూర్

Advertiesment
Fenugreek leaves health benefits
, గురువారం, 18 ఆగస్టు 2016 (10:51 IST)
జుట్టు రాలుతోందా? మెంతికూర ప్యాక్‌ను ట్రై చేయండి అంటున్నారు. మెంతిలో అధిక మోతాదులో లభించే ప్రొటీన్‌ జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులోని నికోటినిక్‌, లెసిథిన్‌ కుదుళ్లు బలంగా మారేందుకు, జుట్టు ఎదగడానికీ సాయం చేస్తాయి. ఇక ఇందులోని పొటాషియం చిన్నవయసులోనే శిరోజాల రంగు మారడాన్ని అరికడుతుంది. ఈ ఫలితాలు అందాలంటే గుప్పెడు మెంతుల్ని ఓ రోజంతా నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి జుట్టుని తడపండి. జుట్టుని అలాగే మూడు నాలుగు గంటలపాటు ఆరనివ్వండి. ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేసి చూడండి. ఇలా వీలైతే రోజూ చేయండి.
 
* తాజాగా ఉండే మెంతిఆకులను ఎంచుకుని శుభ్రంగా కడిగి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ ముద్దకు ఓ రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలకు పెట్టుకోవాలి. అరగంటాగి స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
 
* పావుకప్పు మెంతుల్ని నాలుగైదు గంటల ముందు పెరుగులో నానబెట్టుకోవాలి. దాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే రుబ్బుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి బాగా నలుగు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. ఇలా కనీసం వారంలో ఒకసారి చేస్తే యుక్తవయసు అమ్మాయిల్లో మొటిమల సమస్య తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫీసులో పని ఒత్తిడా? ఇంటికెళ్లగానే భార్యను కౌగిలించుకోండి