Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫీసులో పని ఒత్తిడా? ఇంటికెళ్లగానే భార్యను కౌగిలించుకోండి

మగవారు ఆఫీసు పనులతో సతమతమవుతుంటే... ఇంటికెళ్లగానే భార్య కౌగిలిలో బందీ అయితే చాలు. ఆ ఒత్తిడి భారమంతా ఇట్టే తొలగిపోతుంది. కౌగిలించుకున్నప్పుడు భార్య ఇచ్చే ఒక అందమైన ఆప్యాయత గల ముద్దు అన్నింటినీ మరిపింపజ

ఆఫీసులో పని ఒత్తిడా? ఇంటికెళ్లగానే భార్యను కౌగిలించుకోండి
, గురువారం, 18 ఆగస్టు 2016 (09:50 IST)
మగవారు ఆఫీసు పనులతో సతమతమవుతుంటే... ఇంటికెళ్లగానే భార్య కౌగిలిలో బందీ అయితే చాలు. ఆ ఒత్తిడి భారమంతా ఇట్టే తొలగిపోతుంది. కౌగిలించుకున్నప్పుడు భార్య ఇచ్చే ఒక అందమైన ఆప్యాయత గల ముద్దు అన్నింటినీ మరిపింపజేస్తుంది. దీని వలన ఇద్దరి మధ్య సంబంధం గట్టి పడటమే కాకుండా, ప్రేమ రెట్టింపవుతుంది. 
 
అదర చుంబనం చేసుకునేటప్పుడు శరీరంలో ఎండార్పిన్, ఆక్సిటోసిన్ హార్మోన్‌లు విడుదల అవుతాయి. ఇవి దంపతుల మధ్య మరింత ప్రేమానురాగాన్ని పెంపొందిస్తుంది. ముద్దు పెట్టే సమయంలో మహిళలు తీసుకునే శ్వాస ద్వారా పురుషుడు మరింత ఉద్వేగానికి లోనవుతాడు. లిప్ లాక్ కిస్ ఇద్దరి మధ్య మరింత ప్రేమను పెంచుతుంది. ఇలా చేయటం వల్ల ఇద్దరి ఏవైన గొడవలు, సంఘర్షణలు, విభేదాలుంటే తొలిగపోతాయట. 
 
ముఖ్యంగా దాంపత్య జీవితంలో పాల్గొనే ప్రతి మహిళ... ముందుగా కోరుకునేది పురుషుడు పెట్టే ముద్దునట. వాస్తవానికి తొలి ముద్దు విషయంలో మహిళలు, పురుషుల ఉద్దేశాలు ఒకేలా ఉండవని ఈ సర్వేలో తేలింది. ముద్దులు తమ కోర్కెను తెలియజేసేందుకు మగవారు ఎంచుకుంటే.. స్త్రీలు మాత్రం తమ తమ మధ్య అనుంబంధం మరింతగా పెరిగేందుకు ఎంచుకుంటారట. తనకు ఇష్టమైన ముద్దు ముచ్చట్లను తీర్చే వారి కోసం వారు ఎదురు చూస్తారట. అలాంటి భర్తకు వారు దాసోహమైవుంటారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేడినీటితో తల స్నానం చేస్తే ఏమౌతుంది!