నేడు ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. ఫెడరేషన్ నుంచి కోఆర్డినేషన్ ఛైర్మెన్ వీరశంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు పాల్గొన్నారు.
నిర్మాతల నుంచి దిల్ రాజు, సి. కళ్యాణ్, భోగవల్లి బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి సీఈఓ చెర్రీ, జెమిని కిరణ్, ఎస్.కె.న్, సుప్రియ యార్లగడ్డ, వివేక్ కూచికబోట్ల, స్రవంతి రవి కిషోర్, డైరెక్టర్ తేజ, వై వి ఎస్ చౌదరి, రామ సత్యనారాయణ తదితరులు వున్నారు.
సినీ పరిశ్రమలో మళ్ళి నిరాశాపూరితమైన వాతావరణం
నిర్మాతలు ప్రతిపాదించిన వర్కింగ్ కండిషన్స్ కి ఒక్క దానికి కూడా అంగీకరించని కార్మికుల యూనియన్స్ ,చర్చలు విఫలం. అందుకే సమ్మె కొనసాగింపు దిశగా ఫెడరేషన్ నాయకులు తెలిపారు.
2000 రూపాయల లోపు ఉండే వర్కర్స్ కి వేతనం పెంపు కి అంగీకరించిన నిర్మాతలు. కానీ అధిక వేతనాలు తీసుకొనే వారికి కూడా తప్పని సరిగా పెంచాలి అని పట్టు బట్టిన కొన్ని యూనియన్స్. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అది కష్టం అని చెప్పిన నిర్మాతలు. తమకి అనుకూలంగా కొన్ని వర్కింగ్ కండిషన్స్ అడిగిన నిర్మాతలు అవి తాము చేయమని చెప్పిన యూనియన్స్. దానితో పెద్దల మంకు పట్టుకి ఇబ్బందులు పాలు అవుతున్న రోజు వారి కార్మికులు. ఇప్పటికే10 రోజుల నుండి సమ్మె జరిగింది. రేపుకూడా షూటింగ్ లో పాల్గొనమని కార్మిక సంఘాలు తెలిపాయి.