Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ హీరో ఎవరు?

Advertiesment
Facebook
, గురువారం, 12 మే 2016 (10:10 IST)
ఫేస్‌బుక్‌లో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్‌ని ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రికి తరలించాలని జడ్జి ఆదేశించారు. ఫేస్‌బుక్ చిత్రంలో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. పూర్తి వివరాలను పరిశీలిస్తే కొద్ది రోజుల క్రితం అతడు ఓవర్ ద మూన్ పబ్‌కి వెళ్లగా.. గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు ఇతడిని లోపలికి అనుమతించలేదు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న హీరో అద్దాలు పగలగొట్టి కుర్చీలు విసిరేసి కలకలం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్‌లో అందరూ చూస్తుండగా బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి వీరంగం చేశాడు. 
 
దీంతో జూబ్లిహిల్స్ పోలీసులు అత‌డి‌పై పీడీ చ‌ట్టం కింద కేసు నమోదుచేసి జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న ఉదయ్‌కిరణ్‌ బుధవారం కోర్టులో విచారణకు హాజరయ్యాడు. కోర్టులో విచార‌ణ సంద‌ర్భంగా జ‌డ్జి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఉద‌య్‌కిర‌ణ్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా అతడు రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నాడని, తోటి ఖైదీలపై ఉదయ్‌ కిరణ్‌ దాడి చేశాడని  జైలు అధికారులు తెలిపారు. దీంతో ఉదయ్‌ కిరణ్‌ మానసిక స్థితి సరిగాలేదని పోలీసులు పిచ్చాస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఈ హీరోపై తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌, రాజ‌మండ్రితో పాటు హైద‌రాబాద్‌లో కూడా వివిధ పోలీస్‌స్టేష‌న్ల‌లో కేసులు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీకాంత్ కబాలి చిత్రంలో విలన్‌గా తైవాన్ నటుడు.. కోట్లు దాటిన టీజర్ వ్యూస్