Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజినీకాంత్ కబాలి చిత్రంలో విలన్‌గా తైవాన్ నటుడు.. కోట్లు దాటిన టీజర్ వ్యూస్

Advertiesment
Taiwanese
, గురువారం, 12 మే 2016 (10:03 IST)
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా, రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ''కబాలి''. కలైపులి ఎస్‌. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో విలన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సినిమాలో విల‌న్‌గా నటించాలంటే హీరోకున్న ఎనర్జీ ఉన్న న‌టుడు కావాలి. క‌బాలి సినిమాలో ఫవర్ ఫుల్ విల‌న్ పాత్ర‌కు సినిమా నిర్మాత ఏకంగా దేశదేశాలు తిరిగి ఈ విల‌న్‌ను ప‌ట్టుకు వ‌చ్చాడు. 
 
తైవాన్‌లో న‌టుడుగా ఉన్న విన్‌స్ట‌న్ చావోను క‌బాలి చిత్రంలో ర‌జినీకి సమానంగా నటింపజేశాడట. చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌. థాను ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. అంతేకాదు ''కబాలి'' డబ్బింగ్‌ చెప్పడం కోసం విస్టన్‌ చెన్నై వచ్చారని తెలిపారు.... ఆయనతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. 
 
పా.రంజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ''కబాలి'' సినిమా విల‌న్ ఇత‌డే అంటూ చేసిన ఆ పోస్టుకి ఇప్పుడు చాలా మంది అభిమానులు లైకులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్క‌ెర్లు కొడుతుంది. ఇప్ప‌టికే సినిమా టీజ‌ర్‌ని ప్రేక్షకులు మెచ్చిన సంగతి తెలిసిందే. ఎపుడెపుడు ఈ చిత్రం రిలీజ్ అవుతుందాని ర‌జినీకాంత్ అభిమానుల‌ు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్య 24 : వరల్డ్ వైడ్ కలెక్షన్ల వర్షం .. రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్