Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూర్య 24 : వరల్డ్ వైడ్ కలెక్షన్ల వర్షం .. రూ.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్

Advertiesment
24 Worldwide Box Office Collection
, గురువారం, 12 మే 2016 (09:29 IST)
సూర్య విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో లేటెస్ట్‌గా విడుదలైన మూవీ ''24''. ఈ సినిమా రిలీజైన రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్‌సీస్‌లో రికార్డు వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా అటు తమిళంలో ఇటు తెలుగులోనే కాకుండా కర్ణాటక - మలయాళంలో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా కెనడాలో భారీగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. 
 
వారం రోజుల్లో మొత్తం రూ.8.22 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో 1,157,926 డాలర్లు, కెనడాలో 76,627 డాలర్లు వసూలు చేసిందని సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. మొదటి వారంలోనే రూ.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ''సైన్స్-ఫిక్షన్'' కథ సారాంశంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 
 
దాదాపు పదేళ్లుగా సరైన విజయాలు లేని సూర్యకు ''24'' కరవు తీర్చేసేలాగే ఉంది. వరుసగా ఫెయిల్యూర్లు అందుకున్నసూర్యకు ఈ చిత్రం మంచి ప్రతిఫలాన్నిచ్చింది. ''24''ను అతనే స్వయంగా రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించడం విశేషం. వీకెండ్ అయ్యేసరికే వసూళ్లు రూ.100 కోట్ల మార్కుకు చేరువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశం కోసం నరేంద్ర మోడీ చాలా కష్టపడుతున్నారు : ఐశ్వర్యా రాయ్ బచ్చన్