ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ప్రశంసలు వర్షం కురిపించారు. ప్రధానిగా ఆయన పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా.. దేశం కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారనీ చెప్పుకొచ్చారు.
ఆమె ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ప్రధాని పదవి అనేది నిర్వహించడం అంత తేలికైన పని కాదన్నారు. అలాంటి పదవిని నరేంద్ర మోడీ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కితాబిచ్చారు.
ఇకపోతే... తాను తల్లిగా, భార్యగా, బాధ్యతాయుతమైన పౌరురాలిగా విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నానని చెప్పింది. వృత్తి పట్ల తన సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. కాగా, ఈ నెల 20వ తేదీన విడుదల ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'సరబ్‌జిత్' చిత్రం విడుదల కానుంది.