సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి జరగబోతోంది. ఈ నెలలోనే ఈ పెళ్లి జరగనుంది. పెళ్లికూతురు కూడా దగ్గర బంధువే. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	వధువు పేరు ప్రత్యూష. శ్రీలంకలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు వివాహ వేడుక జరగనుంది. ఇది డెస్టినేషన్ వివాహం కావడం గమనార్హం. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మెహందీ వేడుక ఉంటుంది. 
 
									
										
								
																	
	 
	ఈ పెళ్లికి దాదాపు 200కు పైగా అతిథులు హాజరుకానున్నట్టు సమాచారం. సినిమాల విషయానికి వస్తే... హీరోగా ఆయన తొలి సినిమా 'అహింస' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.