Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కె.జి.యఫ్ హీరో యష్ 19కి రంగం సిద్ధం - డిసెంబర్ 8న టైటిల్ ప్రకటన

Advertiesment
Yash 19
, సోమవారం, 4 డిశెంబరు 2023 (18:06 IST)
Yash 19
కె.జి.యఫ్ 1, కె.జి.యఫ్ 2 చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన రాకింగ్ స్టార్ యష్.. పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. సినిమా సక్సెస్‌లో నటనకే పరిమితం కాకుండా గొప్ప చిత్రాన్ని రూపొందించటంలో, బహుముఖ ప్రతిభతో సినిమాను సక్సెస్ చేయించటం యష్ ఇన్‌వాల్వ్‌మెంట్ గురించి అందరికీ తెలిసిందే. కె.జి.యఫ్ చాప్టర్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యష్ నెక్స్ట్ సినిమా కోసం ఏడాదిపాటు సైలెంట్‌గా వెయిట్ చేశారు. యష్ నెక్ట్స్ మూవీ ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి పెరిగిన నేపథ్యంలో తనపై నమ్మకంతో ఎదురు చూస్తోన్న కోట్లాది మంది అభిమానుల కోసం బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
 
ఎట్టకేలకు సైలెన్స్‌కి బ్రేక్ ఇస్తూ యష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానుల్లో ఇండస్ట్రీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. యష్ 19 అనే వర్కింగ్ టైటిల్‌తో ..యష్ తన తదుపరి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. యష్, నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా యష్ 19 టైటిల్‌ను డిసెంబర్ 8, 2023 ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ప్రకటించనున్నట్లు తెలిపారు.
 
భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ తదుపరి సినిమాను ఎలా చేయాలనే దానిపై చాలా ఆలోచించి అందరికీ నచ్చేలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథాంశంతో ముందుకు రావటానికి సిద్ధమయ్యారు.
 
ఆసక్తికరమైన విషయమేమంటే యష్ తదుపరి సినిమాను అనౌన్స్ చేసే క్రమంలో తన సోషల్ మీడియా డీపీని లోడింగ్ అంటూ మార్చుకోవటం విశేషం. రాకింగ్ తన ప్రొఫైల్ పిక్చర్‌ను ఇలా మార్చటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు యష్ 19 అంటూ నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే యష్ 19పై ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రకటన కోసం అందరూ ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారనటంలో సందేహం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాయ్ నాన్నలో పాట పాడటం ఛాలెంజ్ గా అనిపించింది: మృణాల్ ఠాకూర్