Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

Advertiesment
Thiruveer, Tina Sravya, Rahul Srinivas, Karuna Kumar, Master Rohan, Suresh Bobbili

చిత్రాసేన్

, మంగళవారం, 28 అక్టోబరు 2025 (16:26 IST)
Thiruveer, Tina Sravya, Rahul Srinivas, Karuna Kumar, Master Rohan, Suresh Bobbili
యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. మంగళవారం చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. 
 
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. పలాస కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్‌లో సీన్‌ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
 
హీరో తిరువీర్ మాట్లాడుతూ ... నేను ఇంత మంది మంచి ఫ్రెండ్స్‌ను దర్శకుల రూపంలో సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాత సందీప్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.
 
చిత్ర నిర్మాత సందీప్ అగరం మాట్లాడు తూ..  మా హీరో తిరువీర్ ఈ ప్రయాణంలో ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
 
చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ..  సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో హీరో తిరువీర్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
 
హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ ..   ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇంత మంచి దర్శకులంతా కూడా మా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మేం ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ మూవీని చేశాం. మా టీం అందరికీ థాంక్స్ అన్నారు.
 
దర్శకులు సన్నీ, రామ్ అబ్బరాజు,  ఆదిత్య హాసన్, యదు వంశీ,  దుశ్యంత్, ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ, అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
 
చిత్రంలో పనిచేసిన మాస్టర్ రోహన్, సురేష్ బొబ్బిలి, నటి యామిని మాట్లాడుతూ .. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి