Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

Advertiesment
JD Chakravarthy, Naga Pranav, Kaveri Karnika

చిత్రాసేన్

, మంగళవారం, 28 అక్టోబరు 2025 (16:01 IST)
JD Chakravarthy, Naga Pranav, Kaveri Karnika
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓ.. చెలియా. ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఓ.. చెలియా’ పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మరో అందమైన ప్రేమ గీతాన్ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.
 
విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి చేతుల మీదుగా నాకోసం ఆ వెన్నెల.. అంటూ సాగే లవ్, మెలోడీ పాటను టీం విడుదల చేయించింది. ప్రస్తుతం ఈ పాట శ్రోతల్ని ఇట్టే కట్టిపడేస్తోంది. ఎంఎం కుమార్ బాణీ వినడానికి ఎంతో హాయిగా ఉంది. శివ సాహిత్యం , మేఘన, మనోజ్ గాత్రం హృదయానికి హత్తుకునేలా ఉంది. ఇక ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే హీరో  హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమను చాటేలా కనిపిస్తోంది.
 
ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. నా కోసం ఆ వెన్నెల.. అనే ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశాను. ఈ పాట చాలా బాగుంది.  హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. సినిమా కూడా బాగుంటుందని, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
ఈ చిత్రానికి సురేష్ బాలా కెమెరా వర్క్, ఉపేంద్ర ఎడిటింగ్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
 
తారాగణం: నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి, అజయ్ గోష్, భోగిరెడ్డి శ్రీనివాస్, సారిపల్లి సతీష్, యశోద ఆర్ కొలిశెట్టి, సునీల్ రావినూతల, డార్లింగ్ దాస్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని