బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఇపుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీహార్ సర్కారు కోరగా, దానికి కేంద్రం సమ్మతించింది. అదేసమయంలో కేసును పాట్నా నుంచి ముంబైకు మార్చాలని సుశాంత్ ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్లను రియా బదిలీ చేసిందని సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. శుక్రవారం తమ ముందు విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.
బీహార్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా రియాపై ఈడీ కేసు నమోదు చేసింది. రియాకు సమన్లు జారీ చేసింది. ఇతర అనుమానితులకు వచ్చే వారంలో సమన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. ఎటు చూసినా సుశాంత్ కేసులో రియా చక్రవర్తి చిక్కుల్లో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.