Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవాబ్ చిత్రం కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

Advertiesment
Mukesh Gupta, Ravi Charan and others
, సోమవారం, 3 అక్టోబరు 2022 (18:17 IST)
Mukesh Gupta, Ravi Charan and others
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర, పాయల్ ముఖర్జీ, స్నేహ గుప్త ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రాన్ని నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నవాబ్ మూవీ క్యారెక్టర్ ఇంట్రో ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు.
 
దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ....నా మొదటి సినిమా నల్లమల. మీరు ఇచ్చిన ఉత్సాహంతో ఈ నవాబ్ మూవీని రూపొందిస్తున్నాం. ఇదొక కొత్త తరహా ప్రయత్నం. పూర్తిగా డంపింగ్ యార్డ్ లో సాగే కథతో మూవీ తెరకెక్కిస్తున్నాం. కథ గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం. నవాబ్ క్యారెక్టర్స్ ఇంట్రో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. రెండో సినిమాకు అవకాశం ఇచ్చిన నిర్మాత ఆర్ఎం గారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. మా హీరో ముఖేష్ గుప్తా ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు. నాకు సపోర్ట్ చేస్తున్న టెక్నీషియన్స్ మిత్రులకు థాంక్స్. అన్నారు.
 
హీరో ముఖేష్ గుప్తా మాట్లాడుతూ...నవాబ్ మూవీలో హీరోగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు నేర్చుకుని ఈ సినిమాలో నటించాను. సినిమా వైవిధ్యంగా ఉంటూ మీకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మీ అభిమానం, ప్రేమ కావాలి. అన్నారు.
 
నటుడు రామ రాజ్ మాట్లాడుతూ...గత చిత్రం నల్లమలలో రవిచరణ్ అన్న మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో  దమ్కీ దాస్ అనే పాత్రలో నటిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన రవి చరణ్ అన్నకు థాంక్స్. డంప్ యార్డులో జరిగే కథ ఇది. నవాబ్ అనే టైటిల్ తో వస్తున్నాం. డిఫరెంట్ మూవీగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం మా దర్శకుడు చాలా కష్టపడుతున్నాడు. అన్నారు.
 
సినిమాటోగ్రాఫర్ రమేష్ కేఆర్ మాట్లాడుతూ...నల్లమల టీజర్ చూసినప్పుడు ఎవరీ దర్శకుడు ఇంత వైవిధ్యంగా సినిమా చేశాడు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అమిత్ ను హీరోగా కొత్తగా చూపించాడు. సబ్జెక్ట్ కు సరిపోయే నటులను ఈ డైరెక్టర్ ఎంపిక చేస్తాడని అర్థమైంది. నల్లమల రిలీజ్ తర్వాత దర్శకుడు రవి చరణ్ కు కంగ్రాట్స్ చెప్పాను. డంప్ యార్డ్ లో షూటింగ్ చేయడం కష్టం. ఒరిజినల్ డంప్ యార్డ్ లో షూటింగ్ చేయడం కష్టం. దీని కోసం 10, 12 ఎకరాల్లో ఒక డంప్ యార్డ్ ను సెట్ లా క్రియేట్ చేశాడు దర్శకుడు. అలాగే దీనికోసం వర్క్ షాప్స్ పెట్టాడు. అలా ఫుల్ గా ప్రిపేర్ అయ్యి మంచి సినిమా చేశాడు. అన్నారు.
 
ఈ చిత్రానికి కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్, సంగీతం -  పీఆర్, సినిమాటోగ్రఫీ - రమేష్ కేఆర్, వీఎఫ్ఎక్స్ చందు అది అండ్ టీమ్, ఎడిటర్ - శివ శర్వాణి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గొల్లమూడి రమేష్, పీఆర్వో జీఎస్కే మీడియా, నిర్మాత ఆర్ఎం, రచన దర్శకత్వం - రవి చరణ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నీతో