Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డి అంటే డెడికేషన్.. ఎస్‌ అంటే స్ట్రా‌టజీ.. పి అంటే పాపులారిటీ.. దటీజ్ డీఎస్పీ : చిరంజీవి

సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ (డీఎస్పీ)పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. 'డి.ఎస్.పి అంటే అతని పేరే కాదు.. తీరు కూడా. డి అంటే డెడికేషన్.. ఎస్‌ అంటే స్ట్రా‌టజీ.. పి అంటే పాపులారిటీ అం

డి అంటే డెడికేషన్.. ఎస్‌ అంటే స్ట్రా‌టజీ.. పి అంటే పాపులారిటీ.. దటీజ్ డీఎస్పీ : చిరంజీవి
, సోమవారం, 24 ఏప్రియల్ 2017 (13:40 IST)
సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ (డీఎస్పీ)పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. 'డి.ఎస్.పి అంటే అతని పేరే కాదు.. తీరు కూడా. డి అంటే డెడికేషన్.. ఎస్‌ అంటే స్ట్రా‌టజీ.. పి అంటే పాపులారిటీ అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఈనెల 27వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లోని నాలుగు ప్రాంతాల్లో 'రాక్‌స్టార్‌ డీఎస్‌పీ లైవ్‌ షో'తో అలరించేందుకు డీఎస్పీ సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆదివారం చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్‌‌ను చూస్తే ముచ్చటేస్తుంది. వేదిక మీద అతని ఎనర్జీ చూస్తే వావ్‌ అనక తప్పదు. అతను మ్యుజీషియన్ కాదు, మెజీషియన్ అంటూ కితాబిచ్చారు.
 
'ప్రాంతీయంగానూ, దేశవిదేశాల్లోనూ సంగీత కార్యక్రమాలు జరగడం కొత్తేమీ కాదు. పశ్చిమదేశాల్లో ఎందరో మ్యూజిక్‌తో అలరించి రాక్‌స్టార్స్‌గా రాణించారు. ఒకప్పుడు మైఖేల్‌ జాక్సన్‌వంటి రాక్‌స్టార్స్‌ చేసిన షోస్‌ చూసినప్పుడు ‘మన దగ్గర ఇలా చెయ్యడానికి కుదరదు కదా.. మనం ఈ స్థాయికి చేరుకోవడం కష్టం కదా’ అనిపించేది. కానీ, డీఎస్‌పీ ఆ ఫిలాసఫీని మార్చేసి మనం ఎందుకు చెయ్యలేం అని సవాల్‌గా తీసుకుని వాళ్లకు ధీటుగా కాన్‌సర్ట్స్‌ చెయ్యగలం అని గతేడాది అమెరికా షోతో నిరూపించాడని గుర్తు చేశాడు. 
 
ముఖ్యంగా నా 150వ సినిమాకు అతనిచ్చిన సంగీతానికి అప్పుడే మాటలొస్తున్న పిల్లలు కూడా ‘అమ్మడు.. కుమ్ముడు’ అంటూ ఊగుతూ పాడుతున్నారు. మా ఇంట్లో ఓ పాప ఆ పాట పెడితేనే కానీ అన్నం తినదు. అతని మ్యూజిక్‌ పిల్లలపై ఎంత ప్రభావం చూపిందో తెలుస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. 'ఇండియన్ లైవ్‌ షోస్‌ అంటే చిన్నగా ఉంటాయని విదేశీలు అనుకుంటారు. అమెరికా షో సక్సెస్‌ చేసి మనం కూడా ఆ తరహాలో చెయ్యగలం అని నిరూపించాం అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి కంటే సెక్సీ నువ్వేనయ్యా అన్న వర్మ: అయ్యా నన్నొగ్గేయండయ్యా అని అడుక్కున్న రాజమౌళి