Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దృశ్యం-2: ఎఫ్-3 కంటే ముందే విడుదల.. ఓటీటీ వైపు దృష్టి

Advertiesment
దృశ్యం-2: ఎఫ్-3 కంటే ముందే విడుదల.. ఓటీటీ వైపు దృష్టి
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (12:23 IST)
Drisyam 2
మలయాళం సినిమా దృశ్యంను తెలుగులో విక్టరీ వెంటేష్ హీరోగా ఈ సినిమా రీమేక్ అయ్యి మంచి విజయాన్నిసొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం2 వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీశాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేశారు. 
 
అయితే తెలుగులో రీమేక్ అవుతున్న దృశ్యం 2 కూడా ఓటీటీ వేదికగానే విడుదలవుతుందని గత కోడి రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ ఊపందుకుంది. దాంతో సురేశ్ బాబు స్పందిస్తూ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని తేల్చేశారు. ఏ విషయమైనా తామే స్వయంగా చెప్పేవరకూ ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేశారు.
 
విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో సీనియర్ హీరో వెంకటేష్ ఎప్పుడు ముందుంటారు. మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నటిస్తున్నారు వెంకీ. ఇక త్వరలో నారప్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు ఎఫ్ 3, దృశ్యం 2 సినిమాలు చేస్తున్నాడు వెంకీ. సురేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. వీటిలో దృశ్యం 2 సినిమాను శరవేగంగా పూర్తి చేసి ఎఫ్-3 కంటే ముందే విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభినయ 'దొరసాని' ... "పంచతంత్రం" చిత్రంలో ప్రధాన పాత్రలో..