Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Adivi Sesh: డెకాయిట్ ఇద్దరు దర్శకులా ! అందుకే రెండు సార్లు షూట్ చేస్తున్నారా !

Advertiesment
Adivi Sesh,  Jaine Mary Khan
Adivi Sesh, Jaine Mary Khan
కథానాయకుడు, రచయిత, దర్శకుడు అడివి శేష్ నటిస్తున్న తాజా సినిమా డెకాయిట్. ఈ చిత్రానికి దర్శకుడు షానీల్ డియో. అయితే ఈ సినిమా షూటింగ్ ను రెండు బాషాల్లో చేస్తున్నారు. అందుకే రెండుసార్లు షూట్ చేయాల్సి వస్తుందని శేష్ తెలియజేస్తున్నారు. తాను, దర్శకుడు షానీల్ డియో కలిసి ఈ సినిమాకు కథ రాశామని, షూటింగ్ సమయంలో తమ మధ్య అద్భుతమైన స్వేచ్ఛ ఉండేదని  ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
 
చిత్రీకరణ గురించి అడవి శేష్ వివరిస్తూ,  షూటింగ్ సెట్స్‌లో నాకు దర్శకుడి మధ్య మంచి సంబంధాలున్నాయి. ఒక షాట్ నాకు నచ్చకపోయినా, ఆయనకు నచ్చకపోయినా ముఖం మీదే చెప్పేసుకునేంత స్వేచ్ఛ మాకుంది. ఇది నిజమైన భాగస్వామ్యం. దర్శకుడు షానీల్ మాతృభాష హిందీ నేను తెలుగు వాడిని. దీంతో రెండు భాషల్లోని నేటివిటీ, భావోద్వేగాలు సరిగ్గా పండేలా చూసుకునే బాధ్యతను పంచుకున్నాం" అని అన్నారు.
 
షూటింగ్ ప్రక్రియను వివరిస్తూ, తెలుగులో ఒక పంచ్ డైలాగ్ సీన్ ప్రారంభంలో ఉంటే, హిందీలో అదే డైలాగ్ సీన్ చివరిలో లేదా తర్వాతి సీన్‌లో ఉండొచ్చు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ మార్పులు చేశాం" అని అడివి అన్నారు.
 
ఇందులో ఓ కీలక పాత్రను జైనీ మేరీఖాన్ నటిస్తోంది. పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్న ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ స్టిల్ ను విడుదల చేసింది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rashmika: గద్దర్ అవార్డ్ రావడం సంతోషం, ఇది ఆరంభం మాత్రమే : రష్మిక మందన్న