Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

Advertiesment
Srija, VN Adhithya

దేవి

, గురువారం, 20 ఫిబ్రవరి 2025 (18:09 IST)
Srija, VN Adhithya
మనసంతా నువ్వే,  నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య లేటెస్ట్ ప్రాజెక్టుగా 'స్వప్నాల నావ'  రూపొందింది. డల్లాస్ కి చెందిన ప్రవాసాంధ్రుడు, ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినటువంటి శ్రీ గోపీకృష్ణ కొటారు గారు 'శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్' అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా 'స్వప్నాల నావ' ని రూపొందించడం జరిగింది. నిర్మాత గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు ఈ పాటను ఆలపించడమే కాకుండా నర్తించడం కూడా విశేషంగా చెప్పుకోవాలి. 
 
ఇక ఈ 'స్వప్నాల నావ' థీమ్ విషయానికి వస్తే ఇది.. దివంగత స్టార్ లిరిసిస్ట్ అయినటువంటి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య దీనిని మలిచారు . 'ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్' బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత శ్రీమతి మీనాక్షి అనిపిండి దీనికి సమర్పకులుగా వ్యవహరించారు. ప్రముఖ గాయకుడు,సంగీత దర్శకుడు  పార్థసారథి నేమాని సంగీత దర్శకత్వంలో యశ్వంత్ ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు. 'సిరివెన్నెల సీతారామశాస్త్రి' గారు అంటే దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారికి ఎంతో అభిమానం అని అందరికీ తెలిసిన సంగతే. ఆయన సూపర్ హిట్ సినిమా 'మనసంతా నువ్వే' లో కూడా సిరివెన్నెల గారితో గుర్తుండిపోయే ఓ పాత్రని చేయించారు. 
 
ఇప్పుడు 'స్వప్నాల నావ' తో సిరివెన్నెల గారి గొప్పతనాన్ని, ఆయనపై ఉన్న అభిమానాన్ని గొప్పగా చాటి చెప్పారు ఆదిత్య. అందుకే ప్రేక్షకుల నుండి 'స్వప్నాల నావ' కి విశేషాదరణ లభిస్తుంది. తాజాగా యూట్యూబ్లో  ఈ పాటకు 1 మిలియన్ వీక్షణలు నమోదయ్యాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ వీక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక 'స్వప్నాల నావ' ని వీక్షించిన వాళ్లలో చాలా మంది ప్రేక్షకులు 'టాలీవుడ్ గర్వించదగ్గ దిగ్గజ రైటర్ కమ్ లిరిసిస్ట్ అయినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి వి.ఎన్.ఆదిత్య గొప్ప ట్రిబ్యూట్  ఇచ్చారు అంటూ ఆయన్ని అభినందిస్తున్నారు. 
'స్వప్నాల నావ' క్రూ : ఛాయాగ్రహణం : బుజ్జి.కెసహకారం : యూనస్ సహ దర్శకత్వం : ఇర్షాద్, శ్రీహరి దత్త,  స్టైలింగ్ : శ్రృతి, నైలో

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి