Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయ్‌ దేవర కొండను ఒకప్పుడు పట్టించుకోని దిల్‌ రాజు ! ఎందుకంటే..

vijay-dil raju

డీవీ

, సోమవారం, 1 ఏప్రియల్ 2024 (17:25 IST)
vijay-dil raju
నటుడు విజయ్‌ దేవరకొండ తొలిరోజుల్లో శేఖర్‌ కమ్ముల సినిమా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ లో నలుగురిలో ఒకడిగా నటించాడు. కానీ డైలాగ్‌లు తక్కువ. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా ప్రియదర్శితో కలిసి చేశాడు. 60 లక్షలతో తీసిన ఆ సినిమా కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా విడుదలకు ముందు పలువురు నిర్మాతలను ఆశ్రయించారు. అందులో సురేష్‌ బాబు కూడా వున్నారు. ఆయనే వెనుక వుండి ఈ సినిమాను విడుదల చేశారు. అప్పుడు దిల్‌ రాజుకూడా పంపిణీ రంగంలో వున్నారు. కానీ విజయ్‌ పై అంతగా శ్రద్దపెట్టలేదు. 
 
ఆ తర్వాత విజయ్  గీతా ఆర్ట్స్‌లో టాక్సీవాలా చేశాడు. అదీ బాగా ఆడింది. ఆ తర్వాత అర్జున్‌ రెడ్డి చేశాడు. సందీప్‌ వంగా క్యారెక్టర్‌ విజయ్‌ పోషించాడు. అదీ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. అయినా దిల్‌ రాజుకు విజయ్‌ దేవరకొండ ఆనలేదనే చెప్పాలి. ఆ తర్వాత గీత గోవిందం సినిమా చేశాక అప్పుడు ఆ సినిమా కలెక్సన్లకు, యూత్‌ లో ఫాలోయింగ్‌కు దిల్‌ రాజుకు మెలకువ వచ్చింది. విజయ్‌ మామూలు మనిషికాదనుకున్నాడు. కానీ ఆ తర్వాత పలు సినిమాలు  చేస్తూ, పూరి తో లైగర్‌ చేశాడు. అదీ ప్లాప్‌ అయినా మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అది మిలట్రీ నేపథ్యం గనుక కొన్ని సాంకేతిక కారణాలవల్ల అటకెక్కింది. ఆ టైంలో గీత గోవిందం చేసిన దర్శకుడు పరశురామ్‌ మరో కథను గీతా ఆర్ట్స్‌ బేనర్‌ లో చేయడానికి సిద్ధమయ్యాడు. ఈలోగా దిల్‌ రాజుకు విజయాలు, అపజయాలు వచ్చాయి. 
ఏమయిందో ఏమోకానీ.. అప్పుడు దిల్ రాజు కు ఓ ఆలోచన వచ్చింది.  విజయ్‌ దేవరకొండకు ముందుగా అడ్వాన్స్‌ చెక్‌ లు ఇచ్చాడు. ఈ విషయమై దిల్‌ రాజు మాట్లాడుతూ, ఓ టైంలో నన్ను డబ్బులు కావాలి అని విజయ్‌ అడిగితే ఇచ్చాను అని చెబుతూ, అలా ఫ్యామిలీ స్టార్‌ మొదలయింది. ఈ సినిమానే కాకుండా మరో రెండు సినిమాలను విజయ్‌ తో లాక్‌ చేయించాను అని గర్వంగా చెప్పారు.
 
మరి కేరింత సినిమా టైంలో మీ ఆపీసులో ఆడిషన్‌ కు వచ్చిన విజయ్‌ దేవరకొండను ఎందుకు సెలెక్ట్‌ చేయలేదు అని అడిగితే.. అది నాకు కూడా తెలీదు. విజయ్‌ ఓ సందర్భంలో మీ కేరింత సినిమా కోసం ఆడిషన్‌ ఇచ్చాను అని నాకు అన్నారు. బహుశా అప్పుడు ఆ దర్శకుడు కేరింత కు వచ్చిన వారిలో కొన్ని ఫొటోలు చూపించాడు. అందులో విజయ్‌ ఫొటో ఓవర్‌ లుక్‌ లో కనిపించలేదు అని క్లారిటీ ఇచ్చాడు. మరి కేరింత తర్వాత విజయ్‌ కొన్ని సినిమాలు చేసినా ఎందుకు పట్టించుకోలేదు అంటే.. దానికి ఆయన సమాదానం దాటవేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిల్లు స్క్వేర్ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చేయండి : చిరంజీవి ప్రశంస