శతమానం భవతి సినిమాతో సంచలన విజయం సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న. కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ సాధించిన ఈ సినిమా జా తీయ స్ధాయిలో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వేగేశ్న సతీష్ యువ హీరో నితిన్‌తో శ్రీనివాస కళ్యాణం తెరకెక్కించారు.
అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కూడా శతమానం భవతి చిత్రం వలే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది అనుకున్నారు కానీ..లెక్క తప్పింది...సినిమా ఫ్లాప్ అయ్యింది. తర్వాత ఇదే డైరెక్టర్‌తో థ్యాంక్యూ అనే సినిమా తీయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. ఈ ప్రాజెక్ట్ ఏమైందో తెలియదు.
ఇప్పుడు మరో ఎమోషనల్ డ్రామా తీసేందుకు సతీష్ వేగేశ్న రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మించనుందని తెలిసింది. ఇటివలే ఖాకీ సినిమాను తెలుగులో విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతోంది.
యంగ్ హీరో నటించే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం. మరి..దిల్ రాజు సతీష్ వేగేశ్నతో నిర్మిస్తానన్న థ్యాంక్యూ ఎందుకు ఆగిందో..? ఎందుకు హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చిందో..?