Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లక్ష్ హీరోగా ధీర - పవర్‌ఫుల్ టైటిల్ లుక్

లక్ష్ హీరోగా  ధీర - పవర్‌ఫుల్ టైటిల్ లుక్
, సోమవారం, 3 జనవరి 2022 (18:52 IST)
Dhera ist look
హీరో లక్ష్. విలక్షణ కథలను ఎంచుకుంటూ కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఆయన తాజా సినిమా 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' టీజర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ రెస్పాన్స్ చూసి ఆనందం వ్యక్తం చేసిన నిర్మాతలు అదే బ్యానర్‌పై లక్ష్ హీరోగా మరో పవర్‌ఫుల్ మూవీ అనౌన్స్‌ చేశారు. 'ధీర' అనే పేరుతో ఈ సినిమా రాబోతుందని తెలుపుతూ టైటిల్ లుక్ రిలీజ్ చేశారు.
 
చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ 'ధీర' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇవ్వడమే గాక.. విడుదలకు ముందే 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' మ్యూజిక్‌తో ఆడియన్స్ చేత భేష్ అనిపించుకున్న సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నారు. ఓ విలక్షణ కథకు కమర్షియల్ హంగులు జోడించి ఈ మూవీని చాలా గ్రాండ్‌గా రూపొందిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
 
ఓ వైపు 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' టీజర్‌తో సూపర్ ట్రీట్ ఇస్తున్న హీరో లక్ష్.. టీజర్‌ రిలీజ్ రోజే తన కొత్త సినిమా ప్రకటన రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముందు ముందు మరిన్ని వైవిద్యభరితమైన కథలతో అలరిస్తానని అన్నారు. 'ధీర' అనే టైటిల్‌తో రాబోతున్న తన కొత్త సినిమాలో క్లాస్, మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు టచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనుంది చిత్రయూనిట్.     

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామీణ కుర్రాడి ఆశ, ఆశయాలతో ఏవమ్ జగత్