Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధనుష్‌ నా బిడ్డ.. ఎవరో వచ్చి ధనుష్ నా కొడుకు అంటే తట్టుకోలేకపోతున్నా: కస్తూరి రాజా

మదురైకి చెందిన ఓ వృద్ధ దంపతులు తమిళ హీరో, కొలవెరి మేకర్ ధనుష్ తమ పుత్రుడంటూ.. కోర్టును ఆశ్రయించడంపై.. ధనుష్ తండ్రి, సీనియర్ దర్శకుడు కస్తూరిరాజా స్పందించారు. 1974లో మదురైలో 4వేల జీతానికి పనిచేసినప్పుడ

ధనుష్‌ నా బిడ్డ.. ఎవరో వచ్చి ధనుష్ నా కొడుకు అంటే తట్టుకోలేకపోతున్నా: కస్తూరి రాజా
, శుక్రవారం, 2 డిశెంబరు 2016 (15:59 IST)
మదురైకి చెందిన ఓ వృద్ధ దంపతులు తమిళ హీరో, కొలవెరి మేకర్ ధనుష్ తమ పుత్రుడంటూ.. కోర్టును ఆశ్రయించడంపై.. ధనుష్ తండ్రి, సీనియర్ దర్శకుడు కస్తూరిరాజా స్పందించారు. 1974లో మదురైలో 4వేల జీతానికి పనిచేసినప్పుడు ఉన్న స్వేచ్ఛ, సంతోషం ఇప్పుడే లేదని.. అప్పట్లో తనకు ఇద్దరు బిడ్డలు పుట్టారన్నారు. వారే సెల్వరాఘవన్, ధనుష్ అని చెప్పుకొచ్చారు. 
 
వీరిద్దరూ పుట్టినప్పుడు తండ్రిగా ఎంత ఉప్పొంగిపోయానో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ఎవరో వచ్చి ధనుష్‌ తన కొడుకు అంటే తట్టుకోలేకపోతున్నా. ఏ కన్న తండ్రికి ఇలాంటి బాధలు రాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. అన్నీ వున్నా సంతోషం లేదని బాధపడ్డారు. సినీ పరిశ్రమలో దీర్ఘకాలం కొనసాగడం సాధారణ విషయం కాదు. అది వారివారి ప్రతిభ, కృషిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. చిన్న సినిమాలను, కొత్త నిర్మాతల్ని ప్రోత్సహిస్తే ఎంతోమంది కళాకారులకి ఉపాధి లభిస్తుందని కస్తూరి రాజా వ్యాఖ్యానించారు. 
 
కాగా, వాసవి ఫిలింస్‌ బ్యానర్‌పై వీకే మాధవన్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘పార్కతోనుదే’. కొత్త తారలతో జయ సెంథిల్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మనీస్‌ సంగీతం అందించారు. చెన్నైలోని ఆర్‌కేవీ స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ దర్శకుడు కస్తూరిరాజా, గిల్డ్‌ కార్యదర్శి జాగువార్‌ తంగం, సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవా, నటుడు, కెమెరామెన్ నట్టినటరాజ్‌ తదితరులు అతిథులుగా పాల్గొని ‘పార్కతోనుదే’ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగులో మోహన్ లాల్ హ్యాట్రిక్ 'మన్యం పులి'... రివ్యూ రిపోర్ట్