Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sonakshi Sinha: జటాధర లో సోనాక్షి సిన్హా పై ధన పిశాచి సాంగ్ చిత్రీకరణ

Advertiesment
Jatadhara - Dhana Pishachi Song

చిత్రాసేన్

, సోమవారం, 29 సెప్టెంబరు 2025 (14:09 IST)
Jatadhara - Dhana Pishachi Song
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.
 
ఇటివల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఫస్ట్ ట్రాక్ 'సోల్ ఆఫ్ జటాధార' కి అద్భుతమైన  రెస్పాన్స్ వచ్చింది విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి అక్టోబర్ 1న ధన పిశాచి సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది.  
 
జటాధరలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్‌తో పాటు ప్రముఖ నటులు కనిపించనున్నారు. మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి– విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపించబోతోంది.
 
జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. డివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భావిని గోస్వామి సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. సినిమాకి పవర్ ఫుల్ సౌండ్‌స్కేప్‌ను జీ మ్యూజిక్ కో అందిస్తోంది.
 జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ప్రియురాలిని మరవలేకపోతున్నా.. ఆర్థిక ఒత్తిడిలో కూడా ఉన్నాను.. డైనింగ్ ఏరియాలో ఉరేసుకుని..?