Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు భాగాలుగా ఢిల్లీ ఫైల్స్, ఆగస్టు 15న ది బెంగాల్ చాప్టర్ రిలీజ్

Advertiesment
Abhishek Agarwal

డీవీ

, గురువారం, 3 అక్టోబరు 2024 (15:09 IST)
Abhishek Agarwal
ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ వంటి అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన తర్వాత, మరొక సంచలనమైన ప్రాజెక్ట్ 'ది ఢిల్లీ ఫైల్స్' కోసం ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్‌తో మరోసారి  ముందుకు వచ్చారు.  దేశవ్యాప్తంగా ప్రశంసలు, బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్న 'ది కాశ్మీర్ ఫైల్స్' తో పాటు జాతీయ అవార్డు గెలుచుకున్న కార్తికేయ 2, విమర్శకుల ప్రశంసలు పొందిన గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
 
'ది ఢిల్లీ ఫైల్స్' అనౌన్స్ మెంట్ నుంచి హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తాజాగా మేకర్స్ రెండు పార్ట్స్ గా రూపొందుతున్న దిల్లీ ఫైల్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ది ఢిల్లీ ఫైల్స్ - ది బెంగాల్ చాప్టర్ 15 ఆగస్టు 2025న విడుదలవుతుందని వివేక్ వెల్లడించారు.
 
సోషల్ మీడియాలో, వివేక్ రంజన్ అగ్నిహోత్రి విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఢిల్లీ ఫైల్స్ - ది బెంగాల్ చాప్టర్ ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు. “మార్క్ యువర్ క్యాలెండర్. ఆగస్టు 15, 2025. సంవత్సరాల రిసెర్చ్ తర్వాత, #TheDelhiFiles పవర్ ఫుల్ కథ. చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ప్రజెంట్ చేస్తూ బెంగాల్ చాప్టర్ - రెండు భాగాలలో మొదటిది - మీకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. #RightToLife ." అని ట్వీట్ చేశారు. 
 
వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన సినిమా కోసం కేరళ నుండి కోల్‌కతా, ఢిల్లీ వరకు చాలా దూరం ప్రయాణించి విస్తృత పరిశోధనలు చేశారు. అతను తన చిత్రానికి వెన్నెముకగా నిలిచే చారిత్రక సంఘటనలకు సంబంధించిన 100 పుస్తకాలు  200 కంటే ఎక్కువ కథనాలను చదివి సమాచారాన్ని సేకరించారు. అతను, టీం పరిశోధన కోసం 20 రాష్ట్రాలలో పర్యటించారు, 7000+ రిసెర్చ్ పేజీలు, 1000 పైన ఆర్కైవ్ చేసిన కథనాలను అధ్యయనం చేశారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు... ఏం చెప్తాడో వేచి చూడాల్సిందే..