టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ సిద్ధార్థ్ రాయ్ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి 'సిద్ధాంతం' పాటని విడుదల చేశారు. సినిమాలో చాలా కీలకమైన ఈ పాటని రధన్ పవర్ ఫుల్ ఎమోషనల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. బాలాజీ రాసిన సాహిత్యం కథలోని లోతుని డెప్త్ ని తెలియజేస్తుంది. సింగర్ శరత్ సంతోష్ మనసుని హత్తుకునేలా పాటని ఆలపించాడు.
ఈ ఎమోషనల్ నెంబర్ లో దీపక్ సరోజ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. యూనిక్ కాన్సెప్ట్, కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే వైరల్ అయి హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు విడుదలైన పాట సినిమాపై మరింత క్యురియాసిటీ పెంచింది.
శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ రధన్ సంగీతం అందించారు. శ్యామ్ కె. నాయుడు కెమరా మెన్ కాగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్