Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారీ బ‌డ్జెట్‌తో దాస‌రి బ‌యోపిక్, ద‌ర్శ‌కర‌త్న‌

Advertiesment
భారీ బ‌డ్జెట్‌తో దాస‌రి బ‌యోపిక్, ద‌ర్శ‌కర‌త్న‌
, సోమవారం, 12 జులై 2021 (17:08 IST)
ద‌శాబ్దాల పాటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ముఠా మేస్త్రీగా ఉన్న ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు బ‌యోపిక్ త్వ‌ర‌లో రాబోతోంది. సినిమా పేరు ద‌ర్శ‌కర‌త్న. దీనికి ద‌వ‌ళ స‌త్యం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇమేజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై, తాడివాక ర‌మేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియాగా నిర్మించాల‌ని సంక‌ల్పించారు.
 
దీనికి ప్ర‌ధాన కార‌ణం దాస‌రి చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కాదు.... కాంగ్రెస్ నాయ‌కుడిగా, కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేయ‌డంతో బాలీవుడ్ లో కూడా సినిమా విడుద‌ల చేయ‌నున్నారు. అంతేకాకుండా దాస‌రి హిందీ సినిమాలు కూడా చాలా తీశారు.

వ‌ఫాదార్, ప్రేమ త‌ప‌స్య‌, జ‌క్మీ షేర్, యాద్ గార్, స‌ర్ఫ‌రోష్, స్వ‌ర్గ న‌ర‌క్, జ్యోతి బ‌నే జ్వాలా, ప్యాసా సావ‌న్, ఆజ్ కా ఎమ్మెల్యే, రామ్ అవ‌తార్, ఆశా జ్యోతి వంటి హిందీ సినిమాల‌కు కూడా దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ కార‌ణంగానూ దాస‌రి సినిమా హిందీ తెర‌పై ఆడాల‌ని సంక్ప‌ల్పించారు. 
 
దర్శ‌క ర‌త్న సినిమా అతి పెద్ద బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నామ‌ని, అత్యంత విలువైన సాంకేతి ప‌రిజ్ణానంతో సినిమా రూపొందుతుంద‌ని చెపుతున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌క ర‌త్న సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యింద‌ని, త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభిస్తామ‌ని నిర్మాత పేర్కొంటున్నారు. ఇక దాస‌రి పాత్ర‌లో ఒక ప్ర‌ముఖ న‌టుడు న‌టిస్తాడ‌ని, అది ఎవ‌రో త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామంటున్నారు. ఇత‌ర క్యాస్టింగ్, సాంకేతిక గ‌ణాల ఎంపిక‌లో ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు నిర్మాత‌.  
 
ఈ సినిమాతోపాటు దాస‌రి నారాయ‌ణ రావు ఫిలిం అండ్ టీవీ నేష‌న‌ల్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం కూడా ఏటా నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్ ప్రైమ్‌లో వస్తానంటున్న 'నారప్ప'