ఆమీర్ ఖాన్ "దంగల్" మూవీ కలెక్షన్స్ ... మూడు రోజుల్లో.. రూ.106 కోట్లు!
బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మరోమారు సిల్వర్ స్క్రీన్‌పై తన సత్తా చాటాడు. ఆమీర్ ఖాన్ తాజా చిత్రం "దంగల్" కనక వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో రూ.106.95 కోట్లు వసూలు చేసింది.
బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మరోమారు సిల్వర్ స్క్రీన్‌పై తన సత్తా చాటాడు. ఆమీర్ ఖాన్ తాజా చిత్రం "దంగల్" కనక వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లో రూ.106.95 కోట్లు వసూలు చేసింది.
ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దేశవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూడు రోజుల్లో రూ.106.95 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 'దంగల్' అరుదైన మైలురాయిని దాటిందని, కొత్త రికార్డును సృష్టించిందని ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా శుక్రవారం (తొలిరోజు) రూ.29.78 కోట్లు, శనివారం రూ.34.82 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఇక ఆదివారం రూ.42.35 కోట్లు వసూలు చేయడం విశేషం. కాగా, దేశవ్యాప్త కలెక్షన్స్‌లో ఆమిర్ ఖాన్ చిత్రాల్లో రూ.100 కోట్లు దాటినవి గత 2008- 'గజిని', 2009- 'త్రీ ఈడియట్స్', 2013- 'ధూమ్-3', 2014- 'పీకే'లు ఉండగా, ఇపుడు దంగల్ ఉంది.
ప్రముఖ భారతీయ రెజ్లర్ మహవీర్ సింగ్ పొగట్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ నటన, కూతురి పాత్రలు పోషించిన ఫాతిమా, సాన్యా మల్హోత్ర నటనకు జనం నీరాజనం పట్టారు.