Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బస్తీ మే సవాల్ - సెంటర్ నేను చెప్పను - టైం నువ్వు చెప్పొద్దు: వంగవీటి రాధాకి వర్మ వార్నింగ్

వంగవీటి చిత్రంపై వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే... రంగా గారి క్యారెక్టర్ని వక్రీకరించానన్నా రాధా కామెంట్లకి నా సమాధానం. 1. రంగా గారు బోసిపళ్ళ మహాత్మా గాంధీ అని చూపించాలా? 2. మర్డర్ల మాట

Advertiesment
Ramgopal Varma counter attack
, సోమవారం, 26 డిశెంబరు 2016 (16:12 IST)
వంగవీటి చిత్రంపై వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే...
 
రంగా గారి క్యారెక్టర్ని వక్రీకరించానన్నా రాధా కామెంట్లకి నా సమాధానం. 
1. రంగా గారు బోసిపళ్ళ మహాత్మా గాంధీ అని చూపించాలా?
2. మర్డర్ల మాట అటుంచి ఎవర్ని మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా?
3. మదర్ థెరిస్సా కన్నా సాత్వికుడు అని చూపించాలా?
4. అన్నదానాలు, ప్రజా సేవ తప్ప చీమకైనా హాని చెయ్యని గౌతమ బుద్దుడని చూపించాలా? 
 
వాస్తవాలే చూపించాల్సిందన్న రాధా డిమాండ్లకి  నా సమాధానం-
రంగా గారి గురించి ఆయన భార్య గురించి, రంగా గారి అభిమానులు వినటానికి చూడటానికి ఇష్టపడని డాక్యుమెంటేడ్ వాస్తవాలు నేను చాలా చాలా చూపించగలను. కాని రంగా గారి మీద వున్న గౌరవంతో అవి చూపించలేదు. దమ్ముండి ఆ వాస్తవాలు ఏమిటని రాధా డిమాండ్ చేస్తే వాటన్నింటిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తా. 
 
నేను ముందునుంచి చెప్తున్నది వంగవీటి సినిమా తియ్యడంలో నా ఉద్దేశ్యం ఆ జీవిత కథల ఆధారంగా అప్పుడు జరిగిన ఆ సంఘటనల వెనుక వాళ్ళ సున్నితమైన భావోద్వేగాలని చూపించడం మాత్రమే.
 
ఒరిజినల్ వంగవీటి రాధా, వంగవీటి రంగా గార్లలో ఉన్న గొప్పతనంలో ఈ రాధాకి 0.1% లేకపోవడం మూలానే ఈ రాధా పరిస్థితి ఇలా వుంది. ఏమి అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు.
 
వంగవీటి సినిమా గురించి దుర్భుద్ది ఉన్నవాళ్ళు నా దురుద్దేశ్యం గురించి ఎంత అరిచి గీ పెట్టినా, పచ్చి నిజం ఏమిటంటే రంగా గారి మీద రాధాకి, రత్నకుమారిగారికి ఉన్న గౌరవం కన్నా ఎన్నో రెట్లు నాకెక్కువ గౌరవముంది. ఈ నిజం నిజాయితీగా గుండెల మీద చేయ్యేసుకున్న ప్రతి నిజమయిన రంగా అభిమానికి వాళ్ళ వాళ్ళ మనసుల్లో తెలుసు. నేను తీసిన వంగవీటి సినిమా కరెక్ట్ కాదనుకుంటే రాధాని “అసలు వంగవీటి” అని ఇంకో సినిమా తీసి లోకానికి చూపించుకోమనండి.
 
ఇకపోతే నన్నేదో చేసేస్తానన్న రాధా ఇచ్చిన వార్నింగుకి నా కౌంటర్ వార్నింగ్.
బస్తీ మే సవాల్ - సెంటర్ నేను చెప్పను - టైం నువ్వు చెప్పొద్దు
-రాంగోపాల్ వర్మ
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబోయే భర్త ముందు రెచ్చిపోయిన సమంత.. బికినీలో ఏం చేసిందో తెలుసా?.. అక్కినేని ఫ్యాన్స్ షాక్!