దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. ఆ చిత్రానికి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన విషయం తెల్సిందే. సోమవారం రాత్రి దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఇందులో బాలీవుడ్ నటుడు "బ్రహ్మస్త్ర" సినిమాకుగాను ఉత్తమ నటుడుగా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వరించింది. అలాగే, సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న కన్నడ చిత్రం "కాంతార"లో కన్నడ నటుడు రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును దక్కించుకున్నారు.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులను గెలుచుకున్న చిత్రాల వివరాలను పరిశీలిస్తే,
ఉత్తమ చిత్రం.. ది కశ్మీర్ ఫైల్స్
ఉత్తమ దర్శకుడు.. ఆర్.బాల్కి
ఉత్తమ నటుడు.. రణ్‌బీర్ కపూర్
ఉత్తమ నటి.. అలియా భట్
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్.. రిషబ్ శెట్టి
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్.. వరుణ్ ధావన్
మోస్ట్ వర్సటైల్ యాక్టర్.. అనుపమ్ ఖేర్
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్.. సాచిత్ తాండన్
క్రిటిక్స్ ఉత్తమ నటి.. విద్యాబాలన్
ఉత్తమ సహాయ నటుడు.. మనీష్ పాల్
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్.. ఆర్ఆర్ఆర్