Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుచీ లీక్స్‌ ధనుష్‌కు మరో ఇబ్బంది.. రజనీ అల్లుడికి డీఎన్ఏ టెస్టు.. తండ్రి పేరుతో తంటా..?

తమిళ హీరో, సుచీ లీక్స్‌లో కనబడిన ధనుష్‌ను మరో వివాదంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటికే సుచీలీక్స్ ద్వారా తలపట్టుకుని కూర్చున్న ధనుష్‌‌ను తమ కుమారుడేనని ఓ వృద్ధ జంట కోర్టులో కేసు వేసింది. ఈ కేసుకు సంబం

సుచీ లీక్స్‌ ధనుష్‌కు మరో ఇబ్బంది.. రజనీ అల్లుడికి డీఎన్ఏ టెస్టు.. తండ్రి పేరుతో తంటా..?
, శనివారం, 11 మార్చి 2017 (18:51 IST)
తమిళ హీరో, సుచీ లీక్స్‌లో కనబడిన ధనుష్‌ను మరో వివాదంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటికే సుచీలీక్స్ ద్వారా తలపట్టుకుని కూర్చున్న ధనుష్‌‌ను తమ కుమారుడేనని ఓ వృద్ధ జంట కోర్టులో కేసు వేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ధనుష్‌ పుట్టుమచ్చలు చూపించాల్సిందిగా కోర్టు పేర్కొంది. ఇందుకోసం ధనుష్ కోర్టుకు వెళ్లొచ్చారు. తాజాగా ధనుష్ తమ కుమారుడేనని కదిరేశన్-మీనాక్షి దంపతులు వేసిన కోర్టులో తమ వైపు తగిన ఆధారాలను సేకరించేందుకు దర్శకుడు ధనుష్ తండ్రి కస్తూరి రాజా నానా తంటాలు పడుతున్నారు. 
 
ఇప్పటికే ఈ కేసులో కోర్టు ధనుష్‌కు డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ధనుష్ వద్ద సపరేటుగా న్యాయమూర్తి విచారణ జరిపారు. కోర్టు విచారణ సందర్భంగా ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు అని.. ఆ పేరును ధనుష్‌గా సినిమాల కోసం మార్చేసుకున్నాడని.. ధనుష్ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. కానీ కోర్టులో ధనుష్ పుట్టుమచ్చలు, స్కూల్ సర్టిఫికేట్లు సమర్పించలేదు.
 
ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. స్కూల్ సర్టిఫికేట్లలో ధనుష్ పుట్టుమచ్చల వివరాలు లేవు. దీంతో అనుమానాలు రేకెత్తాయి. ధనుష్ అసలు తండ్రి అని చెప్పుకుంటున్న కస్తూరి రాజా కూడా సినిమాల కోసం గతంలో పేరు మార్చుకున్నారు. 2015వ సంవత్సరం తన అసలు పేరు కృష్ణమూర్తిని.. కస్తూరి రాజాగా గెజటడ్‌లో మార్చుకున్నారు. ఇలా కస్తూరి రాజా పేరు మార్చుకోవడమే ధనుష్‌కు తంటాను తెచ్చిపెట్టింది. 
 
2003లో వెంకటేష్ ప్రభు అనే పేరు ధనుష్‌గా మారింది. అప్పట్లో తండ్రి పేరు కస్తూరి రాజా అనే పేరే ధనుష్ స్కూల్ సర్టిఫికేట్‌లో ఉంది. ఈ సర్టిఫికేట్‌లో ఉన్న తండ్రి పేరు మారడం.. కదిరేశన్- మీనాక్షి దంపతులకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధనుష్‌ అసలైన తండ్రి ఎవరనేది.. డీఎన్ఎ టెస్టులోనూ అసలు విషయం తేలిపోతుంది. 
 
ఇకపోతే.. కదిరేశన్ దంపతులు ధనుష్.. పదో తరగతి 2002లో పూర్తి చేశాడని.. శివగంగై జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోనే అతడు చదువుకున్నాడని వాదిస్తున్నారు. ఆపై నటనపై ఆసక్తితో చెన్నైకి వచ్చి సెటిలైపోయాడని.. అతని వద్ద నుంచి బతుకు తెరువు కొంత మొత్తాన్ని ఇప్పించాల్సిందిగా కోర్టును కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్‌.. సన్నీలియోన్ పరోక్షంగా కౌంటర్.. జాగ్రత్తగా మాట్లాడాలని?