Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్‌.. సన్నీలియోన్ పరోక్షంగా కౌంటర్.. జాగ్రత్తగా మాట్లాడాలని?

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. ప్రపంచంలోని మహిళలందరూ.. సన్నీలా మగాళ్లందరికీ ఆనందం పంచాలని వర్మ ట్వీట్ చేశాడు. దీనిపై

Advertiesment
Choose Your Words Wisely
, శనివారం, 11 మార్చి 2017 (18:02 IST)
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. ప్రపంచంలోని మహిళలందరూ.. సన్నీలా మగాళ్లందరికీ ఆనందం పంచాలని వర్మ ట్వీట్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. వర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాకుండా గోవా పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. 
 
దీంతో పాటు బాలీవుడ్ కార్మిక వర్గాలు తీవ్రంగా హెచ్చరించడంతో వర్మ సారీ చెప్పాడు. తాజాగా వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించింది బాలీవుడ్‌ శృంగార తార సన్నీలియోన్‌. వర్మ పేరు ప్రస్తావించని సన్నీ.. ఓ వీడియో మెసేజ్‌ ద్వారా తన స్పందన తెలియజేసింది. ‘ప్రస్తుత వార్తలన్నింటినీ చదువుతున్నాను. మాట మీద నిలబడినపుడే మార్పు వస్తుందని నేను నమ్ముతాను. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి’ అని ఆ వీడియో మెసేజ్‌లో పేర్కొంది సన్నీ.
 
అయితే ముందు నుంచే సన్నీ లియోన్ అంటే అంతంకు పైకి లేచే రాఖీ సావంత్.. వర్మకు సపోర్ట్ చేసింది. వర్మ చేసిన వ్యాఖ్యలు కరెక్టేనని చెప్పింది. సన్నీ లాగానే అందరు మహిళలూ ఆనందాన్ని పంచాలనే ఆయన వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు వర్మ చెప్పినట్లు పురుషులను మహిళలు ఎలా ఆనందం పంచాలో నేర్చుకోవాలని వ్యాఖ్యానించింది. 
 
మహిళలు తమ బాధ్యతగా వంటగది బాధ్యతలు చూసుకుంటూనే, ఆనందం పంచడం ఎలా? అనే విషయంలో శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు వెళ్లాల్సిన అవసరం ఉందని రాఖీ పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో వర్మకు రాఖీ సపోర్ట్ చేసిందో లేకుంటే.. దెప్పిపొడిచిందో అర్థం కాకుండా చాలామంది తలపట్టుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2 నెలల్లోనే 2 హేలీ తోకచుక్కలు చూపించారు... 'క‌త్రిన, క‌రీన‌, మ‌ద్య‌లో క‌మ‌ల్‌హ‌స‌న్' ద‌ర్శ‌కుడు ర‌త్న‌