Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొద్దింకగా పుట్టివుంటే బాగుండేది.. యేసుదాస్ ఆవేదన.. ఎందుకు?

ప్రముఖ గాయకుడు యేసుదాస్.. బొద్దింకగా పుట్టివుంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే..? యేసుదాస్ రోమన్ కేథలిక్ కుటుంబంలో పుట్టినప్పటికీ హిందూ సంప్రదాయాలనే పాటిస్తారు. హిందూ దేవుళ్ల మీద పాటలు పాడ

Advertiesment
బొద్దింకగా పుట్టివుంటే బాగుండేది.. యేసుదాస్ ఆవేదన.. ఎందుకు?
, సోమవారం, 26 మార్చి 2018 (16:33 IST)
ప్రముఖ గాయకుడు యేసుదాస్.. బొద్దింకగా పుట్టివుంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే..? యేసుదాస్ రోమన్ కేథలిక్ కుటుంబంలో పుట్టినప్పటికీ హిందూ సంప్రదాయాలనే పాటిస్తారు. హిందూ దేవుళ్ల మీద పాటలు పాడటమే కాకుండా.. పలు దేవాలయాలను సందర్శిస్తుంటారు. అందులో భాగంగా అయ్యప్ప మాలను కూడా ధరించి శబరిమలకు వెళుతుంటారు యేసుదాస్. 
 
కానీ తనకు ఇష్టమైన శ్రీకృష్ణుడి దర్శనం గురువాయూర్‌లో లభించకపోవడమే యేసుదాస్ ఆవేదనకు ప్రధాన కారణమైంది. గురువాయూర్‌లో ఉన్న తన ఇష్ట దైవమైన శ్రీకృష్ణుడిని దర్శించుకునే అదృష్టం తనకు లేకుండా పోయిందని యేసుదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అదే ఏదైనా క్రిమికీటకంగా పుట్టింటే ఈపాటికే ఎప్పుడో స్వామిని దర్శించుకొని సంతోషపడే వాడినని తెలిపారు. కాగా గురువాయూర్‌లో అన్యమతస్థులకు ప్రవేశం లేదు. అక్కడికి యేసుదాస్ వెళ్లినా.. దేవాలయం బయటే శ్రీకృష్ణుడి భక్తి పాటలు పాడి వచ్చేసేవారు. కాగా అయ్యప్పస్వామిపై యేసుదాస్ పాడిన హరివరాసనం.. పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియా ప్రకాష్‌ వారియర్‌ను అలా వాడేస్తున్న పోలీసులు...