Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Advertiesment
Fedaration, chamber meet with CM, deputy Cm

దేవీ

, మంగళవారం, 26 ఆగస్టు 2025 (15:42 IST)
Fedaration, chamber meet with CM, deputy Cm
తెలుగు సినిమా కార్మికుల మెరుపు సమ్మెతో ఎవరికి ప్రయోజనం జరిగింది? కార్మికులకు న్యాయం జరిగిందా?  అనుకున్నదొకటి జరిగింది ఒక్కటి అనే నానుడి వినిపిస్తోంది! తమకు ద్రోహం జరిగిందని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. ఫెడరేషన్ నేతలు కార్మికులను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారనే విమర్శలు ఫిలిం నగర్ లో ముఖ్యంగా చిత్రపురి కాలనీలో వినిపిస్తున్నాయి.
 
అసలు సినీ కార్మికుల సమ్మె ప్రారంభమే ఒక్క రోజు ముందు రాత్రి అనుకుని మెరుపు సమ్మెకు ఫెడరేషన్ నేతల పిలువు వెనుక పెద్ద కుట్ర కోణం కనిపిస్తోంది. ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ కలసి ఆడిన గొప్ప మెలో డ్రామా అని అంటున్నారు. 18 రోజులు కొనసాగిన సమ్మెతో కార్మికులకు ఏం ప్రయోజనం జరగలేదు కానీ, నెత్తిన పని భారం మాత్రం పెరిగిందని ఆవేదన వ్యక్తమవుతోంది.
 
చిత్రపురి సొసైటీ కమిటీ కి రాజీనామా చేసిన చిత్రపురి మాజీ కార్యదర్శి, కోశాధికారి లు అయిన కాదంబరి కిరణ్, అనుముల మహానంద రెడ్డి. గత రెండు సంవత్సరాల నుండి మా కమిటీ తప్పులు చేస్తుంటే, పట్టించుకోని ప్రభుత్వ అధికారులు.
 
మా కమిటీ ని రద్దు చేయమని మేము సాక్ష్యాలతో సహా వల్లభనేని అనిల్ అక్రమాలు ఇస్తే, ఇంతవరకూ మా కమిటీ ని రద్దు చేయలేదు. అందుకే నేరుగా తెలంగాణ కో ఆపరేటివ్ కమీషనర్ సురేంద్ర మోహన్ ను కలిసి రాజీనామా లు ఇచ్చామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రాజీనామా దిశగా మరికొంతమంది కమిటీ సభ్యులు. వల్లభనేని అనిల్ మూలంగా కేసులు పెరుగుతుందటంతో తట్టుకోలేక రాజీనామా కి సిద్దపడుతున్నట్టుగా సమాచారం.
 
కమిటీ రద్దు కి ముందే రాజీనామా చేయడం వలన ఈ ఇద్దరినీ అప్రూవల్ గా తీసుకునే అవకాశం, మిగతా 9 మంది కమిటీ సభ్యులు మరో పది రోజులు గడువు కోరినట్లు సమాచారం. సొసైటీ నుండి ఒక్క ఫైల్ మిస్ అయినా, అకౌంట్ ల నుండి డబ్బులు పక్కదారి పట్టిన కో ఆప్ అధికారులదే బాధ్యత అని  ఉద్యమకారులు లిఖితపూర్వకంగా అధికారులకు రాసి ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం