Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమ్మర్ కానుకగా వస్తోన్న విరాటపర్వం

Advertiesment
సమ్మర్ కానుకగా వస్తోన్న విరాటపర్వం
, గురువారం, 28 జనవరి 2021 (18:46 IST)
Rana
రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా 90వ దశకంలో తెలంగాణలోని నక్సల్ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు సమర్పిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ వచ్చింది. 
 
విరాటపర్వం సమ్మర్ కానుకగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను చిత్రబృందం విడుదలచేసింది. విరాటపర్వం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక ఇదే విషయాన్ని రానా తన సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్‌తో పంచుకున్నాడు. అయితే ఇప్పటికే ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. 
 
ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీ పింక్ రీమేక్ 'వకీల్ సాబ్, నేచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్', అక్కినేని నటవారసుడు నాగ చైతన్య 'లవ్ స్టోరీ', మాచో స్టార్ గోపీచంద్ 'సీటిమార్' వరుసగా విడుదల కానున్నాయి. ఇక తాజాగా రానా విరాటపర్వం కూడా చేరడంతో రసవత్తరంగా మారింది. 
webdunia
sai pallavi
 
విరాటపర్వం విషయానికి వస్తే.. నక్సల్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను 'నీది నాది ఒకే కథ' అనే సినిమాలో యూత్‌కు సంబందించి కొత్త అంశాన్ని చర్చించి మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ 'వేణు ఊడుగుల' దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారి ఆద‌ర‌ణ కాలిబాధ‌ను మ‌ర్చిపోయేలా చేసిందిః ప్ర‌దీప్ మాచిరాజు